Suspected Death: వారం రోజులుగా కనిపించకుండాపోయిన 11 ఏళ్ల చిన్నారి.. చెరువులో శవమైన తేలింది.. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు..!
తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో 11 ఏళ్ల బాలిక కిడ్నాప్ హత్య కలకలం రేపుతోంది. మెదక్ జిల్లాలో ఈ దారుణ వెలుగులోకి వచ్చింది.
Medak Girl Suspected Death: తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో 11 ఏళ్ల బాలిక కిడ్నాప్ హత్య కలకలం రేపుతోంది. మెదక్ జిల్లాలో ఈ దారుణ వెలుగులోకి వచ్చింది. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఓ యువకుడ్ని అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లాలో వారం రోజుల క్రితం అదృశ్యమైన 11 ఏళ్ల చిన్నారి శవమై తేలింది. కామారం చెరువులో ఆ చిన్నారి డెడ్‌బాడీని గుర్తించారు పోలీసులు. చిన్నశంకరంపేట మండలం కామారంతండాకు చెందిన రాములు కూతురు సరిత.. తన చిన్నమ్మతో కలిసి మేకలు మేపడానికి వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన నరేష్ అక్కడే బర్రెలను మేపుతున్నాడు. అయితే తర్వాత కాసేపటికి బాలిక కనిపించకుండా పోవడంతో.. తల్లిదండ్రులు, కుటుంబసబ్యులు అంతటా వెతికారు. ఎక్కడా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో నరేష్‌పై అనుమానం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, వారం రోజులుగా ప్రత్యేక బృందాలతో గాలించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, కొందరు కామారం చెరువు దగ్గరే బాలికను చూసినట్టు పోలీసులకు చెప్పడంతో గజఈతగాళ్లతో చెరువును గాలించారు. ఈ క్రమంలో అదృశ్యమైన బాలిక శవమై కనిపించడంతో.. కన్నవారు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, బాలిక సరిత మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి చంపి ఉంటారన్న కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, పోలీసులు బాలిక మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also… OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలివే.. లిస్టులో రెండు బడా చిత్రాలు!