Pakistan Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది దుర్మరణం.. 40 మంది తీవ్ర గాయాలు..

Road Accident in Pakistan: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో..

Pakistan Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది దుర్మరణం.. 40 మంది తీవ్ర గాయాలు..
Road Accident In Pakistan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 19, 2021 | 1:22 PM

Road Accident in Pakistan: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 40 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పంజాబ్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం సియాల్‌కోట్ నుంచి రాజన్‌పూర్ వరకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును సోమవారం ఉదయం ట్రక్కు ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారని కమిషనర్ డాక్టర్ ఇర్షాద్ అహ్మద్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 40 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. బక్రిద్ పండుగ కోసం ప్రయాణికులు వారి స్వగ్రామానికి వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Attack on Lawyer: పట్టపగలే రెచ్చిపోయిన దుండగులు.. బహిరంగంగా లాయర్‌పై కత్తులతో దాడి.. వీడియో

Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది సహా జైషే తోయిబా టాప్ కమాండర్ హతం