Hyderabad: అమీర్‌పేట్‌లో దారుణం.. ‘నా ప్రాణం నువ్వు’ అంటూనే తన ప్రాణం తీసుకున్న యువకుడు..

Hyderabad: హైదరాబాద్‌లో అమీర్‌పేట్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. ‘నా ప్రాణం నువ్వు.. నేను చనిపోతే గానీ నా ప్రేమ విలువ..

Hyderabad: అమీర్‌పేట్‌లో దారుణం.. ‘నా ప్రాణం నువ్వు’ అంటూనే తన ప్రాణం తీసుకున్న యువకుడు..
Crime
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 19, 2021 | 1:49 PM

Hyderabad: హైదరాబాద్‌లో అమీర్‌పేట్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. ‘నా ప్రాణం నువ్వు.. నేను చనిపోతే గానీ నా ప్రేమ విలువ నీకు తెలుస్తుంది’ అంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో షోస్ట్ చేశాడు. వివరాల్లోకెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్‌ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్‌ (29) అమీర్‌పేట్‌లోని ఓ గదిలో స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడే ప్రభుత్వం ఉద్యోగానికై ప్రిపేర్ అవుతున్నాడు.

ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ఓ అమ్మాయితో సుధాకర్ ప్రేమలో పడ్డాడు. అయితే, సుధాకర్ ప్రేమను అమ్మాయి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నా ప్రేమను నువ్వు నమ్మేలా లేవు. నా చావుతో అయినా నాది నిజమైన ప్రేమ అని తెలుసుకుంటావు’ అంటూ ఆ వీడియోలో తన ప్రేమను వ్యక్తపరిచాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుధాకర్.. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, స్నేహితులు గదికి వచ్చి తలుపు తట్టగా ఎంతకీ తీయలేదు. దాంతో అనుమానం వచ్చి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లారు. గదిలో సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని సుధాకర్ మృతదేహాన్ని కిందకు దించారు. సుధాకర్ తీసుకున్న సెల్పీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం అవడం కారణంగానే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించుకున్న పోలీసులు.. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

L Ramana – KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎల్ రమణ ప్రశంసల జల్లు.. కారణమేంటంటే..

Chandrababu: భగ్గమంటున్న ‘జల’ వివాదం.. అయినా నోరు మెదపని చంద్రబాబు.. అసలు కారణం అదేనా?..

Corona Effect: కరోనాకు భయపడి ఇంట్లోనే కాలకృత్యాలు, నిద్రాహారాలు.. తూర్పు గోదావరి జిల్లాలో విచిత్ర ఘటన..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!