Corona Effect: కరోనాకు భయపడి ఇంట్లోనే కాలకృత్యాలు, నిద్రాహారాలు.. తూర్పు గోదావరి జిల్లాలో విచిత్ర ఘటన..

Corona Effect: కరోనా మహమ్మారి యావత్ ప్రంపచాన్నే హడలెత్తిస్తోంది. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

Corona Effect: కరోనాకు భయపడి ఇంట్లోనే కాలకృత్యాలు, నిద్రాహారాలు.. తూర్పు గోదావరి జిల్లాలో విచిత్ర ఘటన..
Corona Effect
Follow us

|

Updated on: Jul 19, 2021 | 1:33 PM

Corona Effect: కరోనా మహమ్మారి యావత్ ప్రంపచాన్నే హడలెత్తిస్తోంది. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఓ కార్యానికి వెళ్లలేక, ఓ విహార యాత్రకు వెళ్లలేక.. ఆఖరికి తమ ఇంటి నుంచి పక్కింటికి వెళ్లాలన్నా భయపడిపోతున్నారు. తేడా వస్తే ప్రాణాలే పోతాయని భయం వారిలో చేరింది. అయితే, కరోనా ఎఫెక్ట్‌కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. కరోనా సోకుతుందనే భయంతో ఓ కుటుంబ సభ్యులు.. ఏడాన్నిర కాలంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉండిపోయారు. కరోనా భయంతో ఒకే గదిలో ఏడాదిన్నర నుంచి జీవనం సాగిస్తున్నారు. అయితే, మరీ చిత్రంగా కాలకృత్యాలు, నిద్రాహారాలు అన్నీ అదే ఒకే గదిలో కానిచ్చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండగా.. తండ్రి, కుమారుడు మాత్రమే అడపాదడపా బయటకు వస్తుంటారు.

అయితే, ఇంటి స్థలం విషయంలో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయించేందుకు అధికారులు వారికి ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. స్థలం విషయమై వేరిఫికేషన్ కోసం వచ్చిన వాలంటీర్‌కు.. ఆ కుటుంబ సభ్యులు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇంట్లోనే ఉండి తమకు స్థలం వద్దని, తాము బయటకు రామని తెగేసి చెప్పారు. వారు అలా అనడానికి గల కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్.. అధికారులకు సమాచారం అందించారు. రాజోలు ఎస్ఐ కృష్ణమాచార్య ఆధ్వర్యంలో వారిని ఇంటికి బయటకు వచ్చేలా చేశారు. అయితే ఏడాన్నరకాలంగా ఒకే గదిలో కాలకృత్యాలు, నిద్రాహారాలు చేయడంతో ఇంట్లో ఉంటున్న ముగ్గురు మహిళ ఆరోగ్యం క్షీణించిపోయింది. వారికి చికిత్స అందించేందుకు రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Also read:

Viral Video: బుడి బుడి అడుగులతో గున్న ఏనుగు అల్లరి.. ఈ వీడియో చూస్తే మీ బాల్యం గుర్తుకు రావడం ఖాయం..

Fine: మొక్కలను తిన్న గొర్రెలు.. యజమానికి 1000 రూపాయల జరిమానా.. ఇదేంటని నిలదీసిన ప్రజలు..

Ashada Masam: వెయ్యి కిలోల చేపలు.. అత్తింటి ‘సారె’ చూసి అల్లుడి కళ్లు బైర్లు కమ్మేసాయంతే..