Fine: మొక్కలను తిన్న గొర్రెలు.. యజమానికి 1000 రూపాయల జరిమానా.. ఇదేంటని నిలదీసిన ప్రజలు..

Fine: హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమంలో..

Fine: మొక్కలను తిన్న గొర్రెలు.. యజమానికి 1000 రూపాయల జరిమానా.. ఇదేంటని నిలదీసిన ప్రజలు..
Fine
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 19, 2021 | 12:49 PM

Fine: హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమంలో బాగంగా నాటిన మొక్కల సంరక్షణను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే వాటి సంరక్షణ బాధ్యతలను అధికారులకు అప్పగించారు. ఆ మొక్కలకు హానీ కలిగించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలను నరికినా.. తొలగించినా.. భారీ జరిమానా విధించడంతో పాటు, అవసరమైతే జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా ఓ గొర్రెల మంద హరితహారంలో నాటిన మొక్కలను తిన్నాయి. అది గుర్తించిన అధికారులు.. ఆ గొర్రెల మంద యజమానికి భారీ జరిమానా విధించారు. గొర్రెలు హరితహారం మొక్కలను తిన్నందుకు వాటి యజమానికి రూ. 1000 జరిమానా విధిస్తూ నోటీసులు పంపించారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకెళితే.. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అయిజ పట్టణానికి చెందిన కురువ మల్లేష్‌కు కొన్ని గొర్రెలు ఉన్నాయి. అయితే, ఇటీవల మల్లేష్ ఇంటికి సమీపంలో హరితహారం మొక్కలను నాటారు. శుక్రవారం నాడు మల్లేష్ తన గొర్రెలను మేత కోసం బయలకు వదిలిపెట్టాడు. అలా మేతకు బయటకు వచ్చిన గొర్రెలు.. హరిత హారం మొక్కలను తినేశాయి. హరిత హారం మొక్కలను సంరక్షిస్తున్న మున్సిపల్ అధికారులు.. సగం తిన్న మొక్కలను గమనించారు. దీనిపై విచారణ జరిపించారు. మల్లేష్‌కు చెందిన గొర్రెలు.. ఆ మొక్కలను తిన్నాయని నిర్ధారించుకున్నారు. అయిజ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మల్లేష్‌కు రూ. 1000 జరిమానా విధించారు. అయితే, ఈ వ్యవహారంపై బాధితుడు సహా స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కనీసం స్పందించని అధికారులు.. ఇంత సమస్యకు మెరుపు వేగంతో ఎలా స్పందించారంటూ నిలదీశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులు.. చిన్న విషయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Also read:

Pegasus: పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది.. సంచలనంగా మారిన ఫోన్ల హ్యాక్‌

Viral Video: మాస్క్ లేకుండా ట్రైన్ ఎక్కిన యువకుడు.. ప్లాట్‌ఫాం పైకి నెట్టేసిన మహిళలు..

Viral Pic: కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..