Pegasus: పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది.. సంచలనంగా మారిన ఫోన్ల హ్యాక్‌

Pegasus Malware:పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో దాదాపు 300 మంది ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి..

Pegasus: పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది.. సంచలనంగా మారిన ఫోన్ల హ్యాక్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jul 19, 2021 | 11:30 AM

Pegasus Malware:పెగాసస్’ అనే స్పైవేర్ సాయంతో దాదాపు 300 మంది ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్‌కు చెందిన జర్నలిస్టులతోపాటు కేంద్ర మంత్రులపైనా నిఘా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పెగాసస్‌పై ఇలా ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ 20 దేశాల్లో వందలాది వ్యక్తుల ఫోన్‌లను పూర్తిగా హ్యాక్ చేశారని, వారికి తెలీకుండానే వారిపై నిఘాపెట్టారని వార్తలు వచ్చాయి. ఆ 20 దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్‌కు చెందిన పాత్రికేయులు, ఉద్యమకారులు, న్యాయవాదులు లాంటి చాలామంది మొబైల్ ఫోన్లపై ఈ హ్యాక్ జరిగినట్లు 2019లో వార్తలు వచ్చాయి.

పెగాసస్ అంటే ఏంటీ? ఎలా పనిచేస్తుంది?

పెగాసస్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ (NSO) అనే సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్‌. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు తయారు చేయడానికి ఆ సంస్థ పెట్టింది పేరు. వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం అది యూజర్లకు ఒక లింక్ పంపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆ యూజర్‌ ఫోన్‌ పూర్తిగా ఎటాకర్ అధీనంలోకి వెళ్లిపోతుంది.

యూజర్‌కు తెలియకుండానే..

అయితే యూజర్‌కు తెలీకుండానే ఆ టూల్ అతడి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒకసారి ఇన్‌స్టాల్ అయ్యాక ఫోన్‌కు సంబంధించిన డేటానంతా ఎటాకర్‌కు పంపించడమే దీని పని. వ్యక్తిగత డేటాతో పాటు పాస్‌వర్డ్స్, కాంటాక్ట్‌ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్‌, ఈమెయిల్స్‌తో పాటు లైవ్ వాయిస్ కాల్స్‌ను కూడా ఇది ట్రాక్ చేయగలదు.

ఒక్క మిస్డ్‌ వీడియో కాల్స్‌ ఇచ్చి హ్యాక్‌..

ఆఖరికి యూజర్‌కు తెలీకుండా అతడి ఫోన్‌ కెమెరాను, మైక్రోఫోన్‌ను కూడా ఎటాకర్ ఆన్ చేయగలడు. ఈ పెగాసస్ టూల్ లేటెస్ట్ వెర్షన్‌లో యూజర్ అసలు ఎలాంటి లింక్‌పైన క్లిక్ చేయకపోయినా సరే, కేవలం ఒక మిస్డ్ వీడియో కాల్ ఇచ్చి కూడా అతడి ఫోన్‌ను హ్యాక్ చేయొచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

పెగాసస్ ఏమేం చేయలుగుతుంది?

ఈ పెగాసస్ సాయంతో ‘జీరో డే’ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయవచ్చని టొరంటోకి చెందిన సిటిజన్ ల్యాబ్ చెబుతోంది. అంటే, యూజర్‌కు ఏమాత్రం తెలీకుండా అతడి ఫోన్‌ను పెగాసస్ అధీనంలోకి తీసుకుంటుంది. ఏమాత్రం అనుమానం రాకుండా చాలా తక్కువ డేటాను, మెమరీని, బ్యాటరీని ఈ టూల్ ఉపయోగిస్తుంది.

సెల్ఫ్‌ డిస్ట్రక్షన్

అయితే రిస్కీ సందర్భాల్లో సెల్ఫ్‌ డిస్ట్రక్షన్.. అంటే తనంతట తానుగా నాశనమయ్యే సాంకేతికత కూడా ఈ టూల్‌కు ఉంటుంది. ఆఖరికి అది ఏ అప్లికేషన్ ద్వారా ఫోన్‌లోకి వస్తుందో, ఆ యాప్ తయారీదారుకు కూడా దాని గురించి తెలిసే అవకాశం ఉండదు. వాట్సాప్, యాపిల్‌ల విషయంలో అదే జరిగింది.

2018 డిసెంబర్‌లో మాంట్రియల్‌లో ఉంటున్న సౌదీ ఉద్యమకారుడు ఒమర్ అబ్దుల్ అజీజ్ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై ఫిర్యాదు చేశారు. పెగాసస్ సాయంతో తన ఫోన్‌ను హ్యాక్ చేసి, తన క్లోజ్ ఫ్రెండ్ అయిన పాత్రికేయుడు జమాల్ ఖషోగ్జీతో సంభాషణలపై నిఘా పెట్టారని ఆయన కేసు వేశారు. కొన్నాళ్లకు ఖాషోగ్జీ ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో హత్యకు గురయ్యారు. ఎక్కువ శాతం మాల్‌వేర్స్‌ నుంచి చిన్నచిన్న జాగ్రత్తల ద్వారా తప్పించుకోవచ్చని, దానికోసం ఎప్పటికప్పుడు యూజర్లు తమ అప్లికేషన్లను, సాఫ్ట్‌వేర్లను అప్‌డేట్ చేసుకోవాలని, అనుమానాస్పద లింక్స్‌ను క్లిక్ చేయకూడదని, గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ఆన్సర్ చేయకూడదని వాట్సాప్‌, యాపిల్ సంస్థలు సూచిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Pegasus: దేశవ్యాప్తంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్.. జాబితాలో కేంద్రమంత్రులు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు!

Oppo A16: ఒప్పో నుంచి మరో కొత్త బడ్జెట్ ఫోన్ .. ధర రూ.10 వేలలోనే.. ఫీచర్స్‌ వివరాలు..!

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!