చరిత్ర సృష్టించిన ట్రాఫిక్ జాం.. 12 రోజులు రోడ్లపై నరకం చూసిన జనం..
ట్రాఫిక్ జామ్. హైదరాబాద్లో ఇది వెరీ కామన్. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే టైంలో రోడ్లపై ఉండే రద్దీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక చినుకుపడిందంటే.. గంటల తరబడి రోడ్లమీద గడపాల్సిందే. ఆ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ముందుకు కదలలేక వెనక్కి వెళ్లలేక జీవితం మీద విరక్తే వస్తుంది.
ఇలా అప్పుడప్పుడు కొన్ని నిమిషాలు గంటలు ట్రాఫిక్ లో చిక్కుకుంటేనే మనకు ఇలా అనిపిస్తుంది. మరి 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగితే..? అందులో చిక్కుకున్న వారు ఎటూ వెళ్లలేక కార్లలోనే ఉండిపోవాల్సి వస్తే..? ఊహించుకునేందుకే భయంగా ఉంది కదా.? కానీ 15 ఏళ్ల క్రితం చైనా ప్రజలు అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జాంలో చిక్కుకుని నరకం చూశారు. చైనా.. ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న ఈ దేశంలో వాహనాల సంఖ్య కూడా ఎక్కువ. అక్కడి రోడ్లన్నీ నిత్యం రద్దీగానే ఉంటాయి. అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ తో జనం ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కానీ చైనా రాజధాని బీజింగ్ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ట్రాఫిక్ జామ్ ఎదుర్కొన్నారు. దాదాపు 100 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ ట్రాఫిక్ జామ్ సమయంలో చైనా నేషనల్ హైవే 110పై లక్షలాది వాహనాలు నిలిచిపోయాయి. కనుచూపుమేరలో బస్సులు, కార్లు, వాహనాలు మాత్రమే కనిపించాయి. 2010 ఆగస్ట్ 14. బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 12 రోజుల పాటు వాహనాల్లోనే చిక్కుకుపోయిన జనం.. వాటిలోనే తిని, తాగి, పడుకోవాల్సి వచ్చింది. మంగోలియా నుంచి బీజింగ్‌కు బొగ్గు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న ట్రక్కుల కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో బీజింగ్ – టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరుగుతోంది. ఆ పనుల కారణంగా రోడ్డును వన్ వేగా మార్చారు. ఇదికాస్తా పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. మంగోలియా నుంచి బీజింగ్ కు వెళ్తున్న ట్రక్కులన్నీ ఒకేసారి ఈ రోడ్డెక్కడం వాటిలో కొన్నింటికి రిపేర్ రావడంతో ట్రాఫిక్ స్తంభించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగలకు కూడా లక్షల్లో వేతనం.. వారు చేసే పని తెలిస్తే మైండ్ బ్లాంక్
హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు.. ఏం జరిగిందంటే..
వామ్మో ..! నీళ్ల బాటిల్ ధర రూ. 50 లక్షలా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

