Samantha: రెండో పెళ్లికి సమంత రెడీ.. మేలో ముహూర్తం?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ సమంత. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది మనసులని దోచుకుంది. కొన్నాళ్లపాటు ఈ భామ పర్సనల్ లైఫ్, కెరీర్ సజావుగానే సాగిన ఇటీవల మాత్రం కాస్త ట్రాక్ తప్పింది. నాగ చైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధితో సమంత డిప్రెషన్‌లోకి వెళ్లింది.
ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు అర్ధమవుతుంది. సమంత హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా కూడా ప్రయత్నిస్తుంది. సామ్ ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘త్రాలాలా మూవింగ్ పిక్చ ర్స్’ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి తొలి చిత్రంగా ‘శుభం మూవీని ప్రేక్షకుల ముందుకు తెస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా సమంత రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం సమంత, రాజ్‌ల పెళ్లి మేలో ఉంటుందని ఫిలిం నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , ఇక పెళ్లి జరగడమే తరువాయి అని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని, ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్‌లో కూడా తెగ హల్‌చల్ చేస్తుంది. నాగ చైతన్య ఇప్పటికే శోభితని వివాహం చేసుకొని సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతుంది. కాని చైతూ నుండి విడిపోయినప్పటి నుండి సమంత సింగిల్‌గానే ఉంటుంది. ఆమె పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నా కూడా దీనిపై సమంత ఇంత వరకు స్పందించింది లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
QR కోడ్ స్కాన్ చేస్తున్నారా ?? మీ బ్యాంక్ ఖాతా జాగ్రత్త!
తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ??
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

