తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ??
కర్ణాటకలో గుట్టు చప్పుడు కాకుండా అంబర్‌గ్రీస్‌ను.. అంటే తిమింగలం వాంతిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 10 కోట్లు విలువ చేసే 10.390 కిలోల పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు విరాజ్‌పేట్ పోలీసులు. పది మంది ముఠాను అరెస్ట్ చేశారు. కేరళలోని తిరువనంతపురం నుంచి వయా బెంగళూరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు అంబర్‌గ్రీస్‌ను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి ఇన్నోవా కారు, క్యాష్ కౌంటింగ్ మిషిన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటివి మరెక్కడైనా చేశారా? అనే కోణంలో విచారిస్తున్నారు. అంబర్ గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పెర్ఫ్యూమ్ ల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఒక్క కిలో అంబర్ గ్రీస్‌కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేషియా, ఇంగ్లాండ్ లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్ గ్రీస్ అమ్మకాలను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు. అయినా సరే అక్రమంగా దీనిని సేకరించి.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

