అడవి రొయ్య తింటే.. ఆహా అనాల్సిందే వీడియో
రొయ్యల్లానే ఉంటాయి. కానీ రొయ్యలు కావు. సముద్రంలో దొరకవు. చెరువుల్లో పెరగవు. అడవుల్లోనే ఈత దుబ్బుల్లో దాగి ఉంటాయి. వాటిని వండుతే ఉంటుంది ఆహా ఏమి రుచి అనకమానరు తిన్నవాళ్ళు. రొయ్య టేస్ట్ ఏముంది? ఈ అడవి రొయ్యలు ఉన్నాయే వాటిని వేటాడి వండుకొని తింటే కమ్మగా ఉంటుందట. ఈ సీజన్లో లభించే అడవి రొయ్యల కూరతో భోజనం పెడితే ఆ ఆతిథ్యం మరువరానిదని భావిస్తుంటారు. పశుందైన విందుగా భావిస్తారు. వాస్తవానికి ఆ ఆదివాసుల ఆహార అలవాట్లు కట్టుబాట్లు విభిన్నంగా ఉంటాయి.
ప్రస్తుత సీజన్లో అడవిలో లభించే ఈ రొయ్యల్ని బొడ్డెంగులుగా పిలుస్తుంటారు. ఈత మొక్కల మొదళ్ళలో లభించే ఈ బొడ్డెంగులను మీసం లేని రొయ్యిగా కూడా గిరిజనులు భావిస్తారు. అడవుల్లో ఈ సీజన్లోనే లభిస్తాయి. గిరిజనులు అమితంగా ఇష్టపడే బొడ్డెంగులు. డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు మాత్రమే అడవుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిని సేకరించుట అంత సులభం కాదు. వాటికోసం పెద్ద సాహసమే చేస్తుంటారు గిరిజనులు. కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ అడవుల్లోనే ఈత చెట్ల దగ్గరికి వెళతారు. ఎందుకంటే ఆ ఈత చెట్ల మొదళ్ళలోనే ఉంటాయి ఈ బొడ్డెంగులు. గిరిజన ప్రాంతంలోనే అడవిలో ఏపుగా పెరిగే ఈత మొక్కల వేర్ల దగ్గర తవ్వి వాటిని సేకరిస్తారు అడవి బిడ్డలు. గొడ్డలితో మొదళ్ళ భాగాన్ని తొలిచి, కత్తులతో నడికి, గునపాలతో తవ్వి అడవి రొయ్యలను సేకరిస్తారు. ఆ బొడ్డెంగులు దొరికితే పంట పండినట్లే అని భావిస్తుంటారు గిరిజనులు. ఎందుకంటే ఇవి అన్ని చోట్ల దొరకవు. ఎంత ప్రయత్నించినా అందరికీ లభించవు. అదృష్టం ఉన్న వాడికే అడవి రొయ్యలు దొరుకుతుంటాయని నమ్ముతారు గిరిజనులు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
