హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు.. ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌లో హాట్ ఎయిర్ బెలూన్‌కు సంబంధించి విషాదం జరిగింది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో హాట్ ఎయిర్ బెలూన్ పెట్టాలనుకున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ స్పెషలిస్ట్‌ను పిలిపించి ఏర్పాట్లు చేయించారు. అయితే దాన్ని ఓసారి పరీక్షిస్తే ఏవైనా సమస్యలు ఉంటే తెలుస్తాయని భావించి సిబ్బంది పరీక్షించబోయింది. అయితే అందులో ఏదో సమస్య ఉండగా.. హఠాత్తుగా బెలూన్ గాల్లోకి ఎగిరింది.
అలాగే దాని తాడుకు బెలూన్ ఆపరేటర్ చిక్కుకుని గాల్లోకి లేచాడు. 80 అడుగుల పైవరకూ వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న స్థానికులంతా విషయం గుర్తించి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ తాడుకు చిక్కుకుని వ్యక్తి గాల్లో ఎగురుతుండడంతో ఏమీ చేయలేకపోయారు. అంతలోనే ఆ తాడు తెగిపోయింది. ఫలితంగా ఆ వ్యక్తి ఒక్కసారిగా 80 అడుగుల పైనుంచి కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కానీ స్థానికులు మాత్రం అతడు బతికే ఉన్నాడేమోననే ఆశతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడిని రాజస్థాన్ కోటాకు చెందిన 40 ఏళ్ల వాసుదేవ్ ఖత్రిగా గుర్తించారు. హాట్ ఎయిర్ బెలూన్ ఆపరేటర్‌కు ఎంతో అనుభవం ఉంది. అతని మృతితో జిల్లా యంత్రంగాం.. మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన వేడుకలను రద్దు చేసింది. అలాగే ప్రమాదం జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా వ్యక్తి గాల్లోకి ఎలా లేచాడు, కింద ఎలా పడ్డాడో అందులో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో ..! నీళ్ల బాటిల్ ధర రూ. 50 లక్షలా?
Samantha: రెండో పెళ్లికి సమంత రెడీ.. మేలో ముహూర్తం?
QR కోడ్ స్కాన్ చేస్తున్నారా ?? మీ బ్యాంక్ ఖాతా జాగ్రత్త!
తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

