AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pegasus: దేశవ్యాప్తంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్.. జాబితాలో కేంద్రమంత్రులు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు!

Pegasus: దేశంలో మళ్లీ హ్యాకింగ్‌ కలకలం రేపుతోంది. పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడైంది. తాజాగా లీక్‌ అయిన ఓ డేటాబేస్‌లో..

Pegasus: దేశవ్యాప్తంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్.. జాబితాలో కేంద్రమంత్రులు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు!
Subhash Goud
|

Updated on: Jul 19, 2021 | 11:12 AM

Share

Pegasus: దేశంలో మళ్లీ హ్యాకింగ్‌ కలకలం రేపుతోంది. పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడైంది. తాజాగా లీక్‌ అయిన ఓ డేటాబేస్‌లో వారందరి మొబైల్‌ నెంబర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు చెందిన ‘పెగాసస్‌’ అనే స్పైవేర్‌ సాయంతో ఈ హ్యాకింగ్‌ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉండే ఈ స్పైవేర్.. నిఘా కార్యకలాపాల కోసం ప్రభుత్వ సంస్థలకు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ విక్రయిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజా హ్యాకింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే, దీంతో తమకెలాంటి సంబంధం లేదని కేంద్రం వెల్లడించింది. దేశ పౌరులందరి గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని హ్యాకింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. ఓ మీడియా కథనం ప్రకారం.. ‘పెగాసస్‌’ హ్యాకింగ్ జాబితాలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారందరి ఫోన్‌ నంబర్లు తాజా డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, న్యాయ కోవిదులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తల వంటి వారి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 2019 స్వార్వత్రిక ఎన్నికల ముందు 2018-19 సంవత్సరాల మధ్య వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. సుప్రీం కోర్టుకు చెందిన ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తి ఫోన్‌ నెంబర్‌ కూడా జాబితాలో ఉంది. భారతదేశంతో పాటు అజర్‌బైజాన్‌, బహ్రెయిన్‌, హంగేరి, మెక్సికో మొరాకో, సౌదీ ఆరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు తాజా డేటాబేస్‌లో ఉన్నాయి. వాషింగ్టన్‌ పోస్టు సహా 16 విదేశీ వార్త సంస్థలు కూడా ఈ హ్యాకింగ్‌ సంబంధిత కథనాలను ప్రచురించాయి. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్ట్‌లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్టయిన ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యావేత్తలకు చెందిన 9 నంబర్లు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ మాజీ ప్రొఫెసర్‌ నంబరు కూడా ఉంది.

కాగా, హ్యాకింగ్ గురించి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆదివారం ఉదయం ట్వీట్ చేయడం.. ఇది జరిగిన కొద్ది గంటల తర్వాత విషయం బయటకు రావడంతో చర్చనీయాంశమవుతోంది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్‌కు గురయినట్టు విదేశీ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించేందుకు సిద్ధమయ్యాయని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ సంస్థ ట్యాపింగ్ చేసినట్లు విదేశీ మీడియా వాషింగ్టన్ పోస్ట్, లండన్ గార్డియన్ వార్తలు ప్రచురిస్తాయన్న వదంతులు వస్తున్నాయి.. అదే నిజమైతే ఆ లిస్ట్‌ను తాను విడుదల చేస్తానని ట్వీట్ లో స్వామి తెలిపారు. కాగా, దేశంలోని పలు ప్రముఖ వార్తాసంస్థలకు చెందిన పాత్రికేయులను హ్యాకింగ్‌కు లక్ష్యంగా చేసుకున్నారు.

ఇవీ కూడా చదవండి:

Sher Bahadur Deuba: నేపాల్‌ కొత్త ప్రధానిగా షేర్‌ బహదూర్‌ డ్యూబా.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Ghost Stories: అందమైన ఆ హోటల్ లో డెత్ మిస్టరీలు .. మూసిన తలుపులు వెనుక దెయ్యాల అరుపులు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!