Ghost Stories: అందమైన ఆ హోటల్ లో డెత్ మిస్టరీలు .. మూసిన తలుపులు వెనుక దెయ్యాల అరుపులు..

Mysteries Springs Hotel: ప్రపంచంలో అనేక వింతలు విశేషాలు.. సైన్స్ సైతం చేదించలేని మిస్టరీలు. ఆ మిస్టరీల హిస్టరీపై ఆసక్తి సర్వత్రా ఆసక్తి ... సర్వసాధారణం. అయితే కొన్ని..

Ghost Stories: అందమైన ఆ హోటల్ లో డెత్ మిస్టరీలు .. మూసిన తలుపులు వెనుక దెయ్యాల అరుపులు..
Fairmont Banff Springs Hote
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 18, 2021 | 7:48 PM

Mysteries Springs Hotel: ప్రపంచంలో అనేక వింతలు విశేషాలు.. సైన్స్ సైతం చేదించలేని మిస్టరీలు. ఆ మిస్టరీల హిస్టరీపై ఆసక్తి సర్వత్రా ఆసక్తి … సర్వసాధారణం. అయితే కొన్ని వింతలు గురించి వింటే.. వాటి గురించి పూర్తిగా తెలుసుకునేవరకూ నిద్రకూడా పట్టదు.. అలాంటి వింత హోటల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. అక్కడ ఉన్న హోటల్ లో కొన్ని డోర్లు మూసి.. కొన్నిసంవత్సరాలవుతుంది. ఇప్పటికీ ఆ మూసిన డోర్లను తెరచి సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దైర్యం చేసి.. ఆ తలపులను తెరిస్తే.. ఏమైనా ప్రమాదం జరిగితే .. అన్న అనుమానంతో ఎవరూ అక్కడ డోర్ల వెనుక ఉన్న మిస్టరీని చేధించే ప్రయత్నం చేయడం లేదు.. ఆ హోటల్ సుందర దేశం కెనడాలో ఉంది.

కెనడాలో విదేశీయులను ఆకట్టుకుని.. టూరిజంను అభివృద్ధి చేయడానికి 1888 లో ఓ హోటల్ కట్టారు. ఈ హోటల్ బాన్ఫ్ నేషనల్ పార్క్‌‌లోని ఓ పెద్ద కొండమీద నిర్మించారు. ఈ హోటల్ పేరు ‘ఫెయిర్మాంట్ బాన్ఫ్ స్ప్రింగ్స్’. అయితే ఈ హోటల్ స్ప్రింగ్స్ హోటల్‌‌ గా ఫేమస్ అయ్యింది. ఈ హోటల్‌‌ లో బస చేసిన ప్రయాణికులు పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక హోటల్ కూడా బయటనుంచి ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇన్నేళ్ళుగా ఈ హోటల్‌‌లో ఇప్పటికీ సాల్వ్‌‌ చేయని ఒక రహస్యం ఉంది.

ఈ హోటల్‌‌లో దెయ్యాలున్నాయని .. ముఖంగా 873 వ రూమ్ లో ఉన్న తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చాలా మంది చెప్పారు. ఈ రూమ్ కు దెయ్యాలు ఉన్న రిలేషన్ ఏమిటంటే.. 1928లో ఒక జంట, ఇద్దరు పిల్లలతో ఈ హోటల్ లోని 873 రూమ్ లో బస చేశారు. ఆ ఫ్యామిలీ ఆ రోజంతా సంతోషంగా గడిపారు.. చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. రాత్రి ఆ రూమ్ లో నిద్రపోయారు.. తెల్లవారి లేచి చూసేసరికి ఆ రూమ్ లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బతికి లేరు.

దీంతో ఈ మరణాలపై దర్యాప్తు చేస్తే.. హోటల్ లో దిగిన వ్యక్తి తన భార్యను, పిల్లలనుచంపి.. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఎందుకు ఆలా చంపాడు అనేది ఇప్పటికీ మిస్టరీనే. కొన్ని రోజుల పాటు ఆ రూమ్‌‌ని మూసేశారు. కొన్నాళ్ల తర్వాత రూమ్ ను యధావిధిగా టూరిస్టులకు ఇచ్చారు.. అయితే ఆ రూమ్ లో దిగిన ప్రతి ఒక్కరికీ ఏదొక సమస్య వచ్చింది. ఆ రూమ్ లో అర్ధరాత్రి సమయంలో అరుపులు వినిపించేవని.. నిద్ర పట్టెది కాదని.. తమను తరిమి కొట్టినట్లు అనిపిస్తుందని 873 రూమ్ లో బస చేసిన పర్యాటకులు చెప్పారు. దీంతో అక్కడ ఆ కుటుంబం దెయ్యాలుగా మారి నివాసం ఉంటున్నారని నమ్మకం అందరిలో బలపడింది. దీంతో ఆ హోటల్ లో ఆ రూమ్ ని క్లోజ్ చేయడమే కాదు.. రూమ్ నెంబర్ కూడా కనిపించకుండా స్టిక్కర్స్ వేశారు. నిజంగా ఆ రూమ్ లో దెయ్యాలున్నా లేవా అనేది ఇంకా మిస్టరీనే.. ఇదే హోటల్ లో మరొక దారుణ ఘటన కూడా జరిగింది.. ఆ హోటల్ లో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఓ పెళ్లి కూతురు మెట్ల మీద నుంచి జారిపడిపోయింది. అప్పటి నుంచి ఆ ఫంక్షన్ హల లో వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని అక్కడ పనిచేస్తున్నవారు చెబుతున్నారు. ఇన్ని దెయ్యాలు కథలున్నా ఈ హోటల్ కు ఆదరణ బాగానే ఉంటుంది. పర్యాటకులు ఈ హోటల్ లో బస చేయడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు.

Also Read: టెన్త్, ఇంటర్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్