AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: సూపర్ బ్యాటరీ బ్యాకప్‌తో నయా ఫోన్ లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారంతే..!

Itel A95 Smartphone: భారతదేశంలోని ప్రజలు ఇటీవల కాలంలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రూ. 10 వేల కంటే తక్కువ ధరలో అధిక ఫీచర్స్‌తో వచ్చే ఫోన్ల గురించి యువత సెర్చ్ చేస్తూ ఉంటారు. యువతను ఆకర్షించేందకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త ఫీచర్స్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఐటెల్ కంపెనీ కూడా ఏ-95 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Smartphone: సూపర్ బ్యాటరీ బ్యాకప్‌తో నయా ఫోన్ లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారంతే..!
Itel A95
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 19, 2025 | 7:03 PM

Share

ఐటెల్ ఏ95 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సరసమైన ధరకు లభించే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ అంతర్నిర్మిత ఆస్క్ ఏఐ టూల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది . ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 తో నడుస్తుంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఐటెల్ ఏ-95 ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. 4 జీబీ, 6 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధరలు రూ.9,599 – రూ.9,999. మధ్య ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో వస్తుంది. దేశంలోని అధీకృత రిటైల్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. 

ఐటెల్ ఏ-95 అనేది బడ్జెట్ స్నేహపూర్వక ధరలో అవసరమైన ఫీచర్లను కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించిన సరసమైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ 6300 చిప్‌సెట్ ద్వాారా శక్తిని పొందుతుంది. ఐటెల్ ఏ-95  సెల్ఫీల కోసం 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పని చేస్తుంది. 

ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ 54 రేటింగ్‌ మద్దతుతో ఇస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ దుమ్ము, స్ప్లాష్ ప్రూఫ్‌గా చేస్తుంది. ఐటెల్ ఏ-95 అంతర్నిర్మిత ఆస్క్ ఏఐతో వస్తుంది. ఇది గ్రామర్ చెక్, టెక్స్ట్ జనరేషన్, కంటెంట్ డిస్కవరీ వంటి ఫీచర్స్‌తో ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి