- Telugu News Photo Gallery Technology photos Top Rated Notebook Laptops on Amazon, check details in telugu
Notebook laptops: నోట్‌బుక్ ల్యాప్‌టాప్.. పనితీరు టాప్.. అమెజాన్‌లో అందుబాటులో బెస్ట్ మోడళ్లు
ఆధునిక కాలంలో కంప్యూటర్ వినియోగం విపరీతంగా పెరిగింది. దైనందిన జీవితంలో ప్రతి పనికీ అత్యంత అవసరంగా మారింది. చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితర అన్నింటిలో వీటి వాడకం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో మినీ కంప్యూటర్లుగా భావించే నోట్ బుక్ లాప్ ట్యాప్ లకు డిమాండ్ పెరిగింది. కాలేజీ, కార్యాలయం, దుకాణం… ఇలా అన్నిచోట్లకు వీటిని తీసుకువెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో శక్తివంతమైన ప్రాసెసర్, మంచి స్టోరేజీ, తేలికైన డిజైన్, బడ్జెట్ ఫ్రెండ్లీ లాప్ ట్యాప్ లకు ఆదరణ ఎక్కువైంది. ప్రస్తుతం అమెజాన్ లో హెచ్ పీ, థామ్సన్, లెనోవా తదితర ప్రముఖ బ్రాండ్ల నోట్ బుక్ లాప్ ట్యాప్ లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Apr 19, 2025 | 2:11 PM

విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాలకు డెల్ ఇన్పైరాన్ 3511 నోట్ బుక్ లాప్ ట్యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని ఐ5-1135జీ7 ప్రాసెసర్ తో అన్ని పనులు వేగవంతంగా జరుగుతాయి. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్ డీ తో ఫైళ్లు, ఫోల్డర్లను చక్కగా నిల్వ చేసుకోవచ్చు. 15.6 అంగుళాల డిస్ ప్లే తో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్ల్యూటూత్ తో చాలా సులభంగా ఫోన్, టాబ్లెట్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. తేలికగా ఉండడంతో ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. డెల్ నోట్ బుక్ లాప్ ట్యాప్ ను అమెజాన్ లో రూ.49,250కి అందుబాటులో ఉంచారు.

మల్టీ టాస్కింగ్ కోసం హెచ్ పీ 255 లాప్ టాప్ చాలా బాగుంటుంది. దీనిలోని ఏఎండీ అథ్లాన్ సిల్వర్ 7120యు ప్రాసెసర్ తో పని వేగంగా జరుగుతుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో డాక్యుమెంట్లు, ముఖ్యమైన ఫైళ్లను సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. 15.6 అంగుళాల డిస్ ప్లే ద్వారా విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 1.52 కిలోల బరువైన ఈ లాప్ టాప్ ను ఎక్కడి కైనా చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. బ్యాటరీ చార్జింగ్ సుమారు 8 గంటలు వస్తుంది. అమెజాన్ లో ఈ లాప్ ట్యాప్ రూ.22,960కి అందుబాటులో ఉంది.

లెనోవా వీ15 ఇంటెల్ సెలెరాన్ నోట్ బుక్ లాప్ ట్యాప్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రజలకు నమ్మకమైన బ్రాండ్ కావడంతో పనితీరు విషయంలో డోకా ఉండదు. దీనిలో ఎన్4500 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 15.6 అంగుళాల డిస్ ప్లే తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమైన పత్రాలు, ఫొటోలను దాచుకోవడానికి సరిపడినంత నిల్వ ఉంటుంది. దీనిలోని డాల్బీ అట్మాస్ స్పీకర్లతో సినిమాలు చూసినా, పాటలు విన్నా, గేమ్ ఆడినా మంచి అనుభూతి కలుగుతుంది. ఈ నోట్ బుక్ లాప్ ట్యాప్ ను అమెజాన్ లో రూ.21,980 ధరకు అందుబాటులో ఉంచారు.

తేలికైన, స్లైలిష్ డిజైన్ లాప్ ట్యాప్ కోరుకునే వారికి థామ్సన్ నోట్ బుక్ లాప్ ట్యాప్ చక్కగా సరిపోతుంది. కోర్ l5 ప్రాసెసర్ తో పనితీరు చాలా వేగంగా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కోసం బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని డ్యూయల్ స్పీకర్లతో సినిమాలు, షోలు చూసినప్పుడు, మ్యూజిక్ విన్నప్పుడు క్రిస్టల్ క్లియర్ ఆడియోను వినవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తూ సుమారు 6 గంటలు వినియోగించవచ్చు. ఇతర ఫోన్లు, టాబ్లెట్లకు కనెక్ట్ చేసుకోవడానికి బ్ల్యూటూత్ కనెక్టివిటీ ఎంపిక ఉంది. 15.6 అంగుళాల డిస్ ప్లే తో విజువల్ క్లియర్ గా కనిపిస్తుంది. అమెజాన్ లో రూ.32,990కి ఈ లాప్ ట్యాప్ ను కొనుగోలు చేయవచ్చు.

వాకర్ థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ లో 14.1 అంగుళాల డిస్ ప్లే ఏర్పాటు చేశారు. దీనిలో యాంటీ గ్లేర్ స్క్రీన్ అదనపు ప్రత్యేకత. దీనివల్ల పగటి పూట కూడా స్పష్టంగా చిత్రాలను చూడవచ్చు. జెమిని లేక్ సెరెలాన్ ఎన్4020 ప్రాసెసర్ తో పనితీరు సూపర్ గా ఉంటుంది. ప్రాజెక్టులను చాలా వేగంగా పూర్తి చేయవచ్చు. తేలికైన ఈ లాప్ ట్యాప్ ను చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. కనెక్టివిటీ కోసం బహుళ హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్ బీ, ఒక హెచ్ డీఎంఐ టైప్ సి పోర్టు ఏర్పాటు చేశారు.




