AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు.. రేవంత్ బృందం కీలక ఒప్పందం!

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు.. రేవంత్ బృందం కీలక ఒప్పందం!
Cm Revanth Reddy Japan Tour3
Balaraju Goud
|

Updated on: Apr 19, 2025 | 10:02 PM

Share

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

జపాన్ పర్యటనలో బిజిబిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. అక్కడి తెలుగు కమ్యూనిటీని కలుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు వివరించారు. ఎన్ఆర్ఐలు రాష్ట్ర అభివృద్ధిలో భాగం అయ్యేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. సొంత ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ సాధించాల్సినంత ప్రగతి ఇప్పటికే సాధించిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జపాన్‌ పర్యటనలో అక్కడి తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఐటీ, ఫార్మాతో పాటు.. ఇప్పుడు పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో డ్రై పోర్ట్‌ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మచిలీపట్నం పోర్టుతో దీన్ని లింక్ చేసి.. ఆటోమొబైల్ ఇండస్ట్రీని విస్తరించుకుందామన్నారు. టోక్యో రివర్‌ఫ్రంట్‌ను పరిశీలించామన్న సీఎం రేవంత్.. మూసీ నది ప్రక్షాళన చేద్దామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతుందన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగురోడ్డు, రేడియల్ రోడ్ల ప్రాజెక్టులు తెలంగాణ పురోగతికి కీలకమన్నారు. తెలంగాణకు పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు పెరగాలని ఆకాంక్షించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎన్ఆర్ఐలు తోడ్పాటు అందిస్తే.. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. సొంత ప్రాంత అభివృద్ధిలో భాగం కావాలని పిలుపు నిచ్చారు సీఎం రేవంత్.

టెర్న్ (టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్ గ్రూప్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది. జపాన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. తెలంగాణలో నైపుణ్యమున్న నిపుణులను జపాన్‌లోని అధిక డిమాండ్ ఉన్న రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాలలో అంతర్జాతీయ నియామకాలు చేపడుతుంది.రాజ్ గ్రూప్ జపాన్‌లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ త్సుకుయి కార్పొరేషన్ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో గతంలో టామ్ కామ్ తో కలిసి పని చేసింది. కొత్త ఒప్పందంతో హెల్త్ కేర్ రంగంలో పాటు ఇతర రంగాల్లోనే సహకారం విస్తరించనుంది.

శనివారం(ఏప్రిల్ 196) ఈ రెండు జపనీస్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది రేవంత్ సర్కార్. దీంతో రాబోయే ఒకటి నుండి రెండు సంవత్సరాలలో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి. హెల్త్ కేర్, నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ రంగంలో (ఆటోమోటివ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 100 ఉద్యోగాలు, హాస్పిటాలిటీ రంగంలో 100 ఉద్యోగాలు, నిర్మాణ రంగంలో (సివిల్ ఇంజనీరింగ్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాగ్రి నిర్వహణ) 100 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. యువతకు నైపుణ్యాల శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు ఈ ఒప్పందాలు అద్దం పట్టాయి.

టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే TERN గ్రూప్, జపాన్‌లో సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్ మరియు Specified Skilled Worker (SSW) నియామకాల్లో ప్రసిద్ధి చెందిన సంస్థ. అలాగే, రాజ్ గ్రూప్, జపాన్‌లోని ప్రముఖ నర్సింగ్ కేర్ సంస్థ సుకూయి కార్పొరేషన్‌తో కలిసి, సంరక్షకుల (కేర్ టేకర్స్) శిక్షణ , నియామకాలలో TOMCOMతో ఇప్పటికే సహకరిస్తోంది. తాజా ఒప్పందంతో ఈ భాగస్వామ్యం ఆరోగ్యేతర రంగాలకు కూడా విస్తరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను అందించే లక్ష్యాన్ని ఈ ఒప్పందాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..