Hyderabad: బాలయ్య మజాకానా..! ఫ్యాన్సీ నెంబర్‌ను ఎంతకు దక్కించుకున్నారో తెల్సా..
ఫ్యాన్సీ సెల్ నంబర్స్, ఫ్యాన్సీ నంబర్స్ ఉన్న వెహికిల్‌లకు డిమాండ్ మామూలుగా ఉండదు. కాస్ట్లీ కార్లు, బైక్‌లు ఎక్కువగా వాడేవారు అయితే ఆ ఫ్యాన్సీ నంబర్స్ కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి రెడీ అవుతుంటారు. అలాంటిది మన హైదరాబాద్‌లో ఎక్కువగా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటుంది.

ఫ్యాన్సీ సెల్ నంబర్స్, ఫ్యాన్సీ నంబర్స్ ఉన్న వెహికిల్‌లకు డిమాండ్ మామూలుగా ఉండదు. కాస్ట్లీ కార్లు, బైక్‌లు ఎక్కువగా వాడేవారు అయితే ఆ ఫ్యాన్సీ నంబర్స్ కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి రెడీ అవుతుంటారు. అలాంటిది మన హైదరాబాద్‌లో ఎక్కువగా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ శుక్రవారం జరిగిన ఫ్యాన్సీ నెంబర్స్ వేలంలో ఖైరతాబాద్ RTO ఆఫీసుకు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా.?
మాములుగా కొత్త వెహికిల్ కొంటే మంచి నెంబర్ కోసం ట్రై చేస్తాం. లక్కీ నెంబర్ సెంటిమెంట్ అని.. కొన్ని నెంబర్స్ కోసం.. మనం కొంతవరకు ట్రై చేస్తాం. ఎక్కువ క్రేజ్ ఉన్న నెంబర్స్‌కు RTO అధికారులు వేలం వేస్తుంటారు. అయితే నిన్న ఖైరతాబాద్‌లో జరిగిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్స్ వల్ల అక్షరాలా రూ. 37 లక్షల ఆదాయం రవాణా శాఖకి వచ్చింది.
రవాణా శాఖలో కేవలం ఖైరతాబాద్ RTO ఆఫీస్‌లో ఫ్యాన్సీ నెంబర్స్ కోసం జరిగిన వేలంలో మొత్తం 37,15,645 రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్కో నెంబర్‌కి ఒక్కో అమౌంట్ వచ్చింది. నెంబర్ క్రేజ్‌ని బట్టి వేలం జరగగా.. అత్యధికంగా TG09 F0001 నెంబర్‌కి 7,75,000 రూపాయలకు సినీ హీరో నందమూరి బాలకృష్ణ దక్కించుకున్నారు. TG09 F0009 నెంబర్‌ను 6,70,000 రూపాయలకు ప్రైవేట్ కంపెనీ. TG09 F0005ను 1,49,999 జెట్టి ఇన్ఫ్రా, ఆంధ్రా ఇన్‌ఫ్రా. TG09 F0099 నెంబర్‌ను 4,75,000 రూపాయలకు ప్రైవేట్ కంపెనీ దక్కించుకుంది.