Viral Video: మాస్క్ లేకుండా ట్రైన్ ఎక్కిన యువకుడు.. ప్లాట్‌ఫాం పైకి నెట్టేసిన మహిళలు..

Maskless Man pushed off a Train: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. అయితే.. ఈ కరోనా కాలంలో.. ముఖానికి మాస్క్‌,

Viral Video: మాస్క్ లేకుండా ట్రైన్ ఎక్కిన యువకుడు.. ప్లాట్‌ఫాం పైకి నెట్టేసిన మహిళలు..
Maskless Man Pushed Off A Train
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 19, 2021 | 11:24 AM

Maskless Man pushed off a Train: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. అయితే.. ఈ కరోనా కాలంలో.. ముఖానికి మాస్క్‌, చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్‌, భౌతిక దూరం మన జీవనంలో భాగమయ్యాయి. వైరస్‌ నియంత్రణకు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని అన్ని దేశాలు తమ ప్రజలకు సూచనలతోపాటు ఆంక్షలు కూడా విధించాయి. ఒకవేళ ఉల్లంఘిస్తే వారిపై జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయినా కొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యం వల్లనే మహమ్మారి తీవ్రత పెరిగిందని అధ్యయనాలు చెపుతున్నా మాస్క్ ధరించడం లేదు. అలా మాస్క్‌ ధరించని వారిపై జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.

తాజాగా స్పెయిన్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి రాగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మాస్కు లేకుండా ట్రైన్ ఎక్కిన ఓ యువకుడిపై.. జనం ఆగ్రహం వ్యక్తంచేసి బయటకు నెట్టేశారు. వివరాలు.. స్పెయిన్‌లోని లోకల్‌ మెట్రో ట్రైన్‌లోని ఓ వ్యక్తి మాస్క్‌ ధరించకుండా ఎక్కాడు. దీంతో ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్‌ ఎందుకు ధరించలేదంటూ.. ఆ వ్యక్తిని రైలు నుంచి దిగిపోవాలని చెప్పారు. అయినా.. ఆ వ్యక్తి వినలదు. దీంతో ‍ప్రయాణికుల్లోని ఇద్దరు మహిళలు మరింత ముందుకొచ్చి.. దిగాలంటూ ఆ వ్యక్తిని బలవంతంగా డోర్‌ వద్దకు తీసుకువెళ్లారు. అయితే అతను దిగనంటూ మొండికేసినా.. చివరకు ఆ ఇద్దరు మహిళలు అతడిని బలవంతంగా ట్రైన్‌ డోర్‌ నుంచి ఫ్లాట్‌ఫారం మీదకు నెట్టేశారు.

ఈ వ్యవహారమంతా స్టేషన్‌లో రైలు ఆగి ఉండగానే జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆ వ్యక్తికి తగినపని జరిగిందంటూ కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. మరికొందరు అంత రాద్దాంతం చేయాల్సిన పని లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

Viral Video: మాంచి నిద్రలో ఉన్న పెద్దపులి.. అరిచి డిస్ట్రబ్ చేసిన నెమలి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!