Viral Video: మాంచి నిద్రలో ఉన్న పెద్దపులి.. అరిచి డిస్ట్రబ్ చేసిన నెమలి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Viral Video: నిద్ర అంటే చాలా మందికి ప్రాణం. కొందరైతే నిద్రను ఓ రేంజ్‌లో ఆస్వాధిస్తారు. అయితే ఆదమరిచి నిద్రపోతుంటే..

Viral Video: మాంచి నిద్రలో ఉన్న పెద్దపులి.. అరిచి డిస్ట్రబ్ చేసిన నెమలి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Tiger Hunting
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 19, 2021 | 10:32 AM

Viral Video: నిద్ర అంటే చాలా మందికి ప్రాణం. కొందరైతే నిద్రను ఓ రేంజ్‌లో ఆస్వాధిస్తారు. అయితే ఆదమరిచి నిద్రపోతుంటే ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే ఎలా ఉంటుంది. చిర్రెత్తుకొస్తుంది. కొందరైతే.. తాము నిద్రపోతుండగా ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే లాగిపెట్టి కొడుతుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. మనుషుల సంగతి ఇలా ఉంటే.. క్రూర మృగాల పరిస్థితి ఏంటి?. అవి గాఢ నిద్రలో ఉండగా.. డిస్ట్రబ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవమే ఓ నెమలి ఎదుర్కొంది. అయితే, తృటిలో ప్రాణాలు దక్కించుకుంది.

అడవికి రాజు సింహం అనే విషయం అందరికీ తెలిసిందే. దాని గర్జన శబ్ధం దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు వినిస్తుందట. అందుకే సింహం గర్జనకు అడవి మొత్తం హడలిపోతుంది. ఇక పులిది కూడా అంతే స్థాయి. ఏమాత్రం తేడా వచ్చినా జంతువైనా.. మనిషైనా.. పక్షి అయినా.. ఫలహారంగా మారాల్సిందే. అలాంటి క్రూరమైన పులి గాఢ నిద్రలో ఉండగా.. లేపితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓ ప్రయత్నంగానే ఈ పనిని చేసింది. ఓ పొదలో పెద్ద పులి హాయిగా నిద్రిస్తోంది. ఇంతలో పక్కనే మైదానంలో ఉన్న నెమళ్లు పెద్ద పెట్టున కూత కూశాయి. నెమళ్ల శబ్ధానికి పొదల్లో హాయిగా పడుకున్న పులి.. ఒక్కసారిగా మెల్కొంటుంది. ఏంటా అని చూడగా.. నెమళ్ల గుంపు దానికి కనిపిస్తుంది. అప్పుడే లేచిని ఆ పులికి అకలేసినట్లుంది. ఎదురుగా ఉన్న నెమళ్లగా తినేందుకు ప్లాన్ వేసింది. పొదల మాటున నక్కి.. అదును కోసం వేచి చూసిన ఆ పెద్దపులి.. ఒక్క ఉదూటున ఆ నెమళ్ల గుంపుపై దూకుతుంది. అయితే, పులి అటాక్‌ను పసిగట్టి నెమళ్లు.. తెలివిగా ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకుంది.

పులి వేటకు సంబంధించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారుతోంది. నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. పులి వేట ఇంత భయంకరంగా ఉంటుందా? అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. టైగర్ వేటను తొలిసారి చూశానని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి.

Viral Video:

Also read:

IMD Rain Alert: ముంబైని ముంచెత్తిన కుండపోత వాన.. దేశం పలు ప్రాంతాల్లో నేడు భారీవర్షాలుః ఐఎండీ

‘కిడ్నాప్ ఘటనతో’.. పాకిస్తాన్ నుంచి తమ రాయబారి సహా దౌత్యాధికారులను వెనక్కి పిలిపించిన ఆఫ్గనిస్తాన్

Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది సహా జైషే తోయిబా టాప్ కమాండర్ హతం