AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMD Rain Alert: ముంబైని ముంచెత్తిన కుండపోత వాన.. దేశం పలు ప్రాంతాల్లో నేడు భారీవర్షాలుః ఐఎండీ

దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది.

IMD Rain Alert: ముంబైని ముంచెత్తిన కుండపోత వాన.. దేశం పలు ప్రాంతాల్లో నేడు భారీవర్షాలుః ఐఎండీ
Heavy Rain
Balaraju Goud
|

Updated on: Jul 19, 2021 | 10:19 AM

Share

IMD Weather Forecast: దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కొంకణ్, బీహార్ ప్రాంతాల్లో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు చెప్పారు.భారీవర్షాల వల్ల పలు లోతట్టుప్రాంతాల్లో వరదనీరు ప్రవహించే అవకాశముంది.

మరోవైపు, దేశ ఆర్థిక రాజధాని ముంబైని ముంచెత్తిన భారీ వర్షం.. పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. ఏకధాటి వాన ఎన్నో కుటుంబాలకు దుఃఖాన్నే మిగిల్చింది. చెంబూర్‌లో ఇళ్లు కూలిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలపాలైన మరో ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇక విఖ్రోలీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో 10 మంది మరణించారు. భాండుప్‌ ఏరియాలో ఓ గోడ కూలి పదహారేళ్ల బాలుడు చనిపోయాడు.

ముంబైలో నిన్న రికార్డ్‌ స్థాయి వర్షపాతం నమోదైంది. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. భారీ వరదనీటితో ట్రాఫిక్‌ జామైంది. రైల్వే ట్రాకులపై నడుం లోతున నీళ్లు నిలిచిపోవడంతో లోకల్‌ ట్రైన్స్‌ను రద్దు చేశారు అధికారులు. అయితే, ముంబైకు ఇంకా ముప్పు తొలగిపోలేదని..ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐఎండీ వార్నింగ్‌తో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే. నిన్నటి వర్షాలు..2005 జూలై 26న విలయం సృష్టించిన అతి భారీ వర్షాన్నే తలపించిదంటున్నారు పలువురు వాతావరణశాఖాధికారులు.

ఇక, దేశ రాజధాని ఢిల్లీ కూడా నీట మునిగింది. తెల్లవారుజామునుంచే ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. ఈ వర్షాలకు ఢిల్లీ నగరం చెరువులా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు, ఉత్తరాఖండ్‌ కూడా భారీ వర్షాలకు గజగజలాడిపోతోంది. ఉత్తరకాశీ జిల్లాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి వరదలు. వర్షాలు, వరదల ధాటికి ముగ్గురు మృతి చెందగా.., నలుగురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also….  జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది సహా జైషే తోయిబా టాప్ కమాండర్ అబూ అక్రమ్ మృతి..