‘కిడ్నాప్ ఘటనతో’.. పాకిస్తాన్ నుంచి తమ రాయబారి సహా దౌత్యాధికారులను వెనక్కి పిలిపించిన ఆఫ్గనిస్తాన్

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి తమ దేశ రాయబారి సహా ఇతర దౌత్యాధికారులను ఆఫ్ఘనిస్థాన్ వెనక్కి పిలిపించింది.

'కిడ్నాప్ ఘటనతో'.. పాకిస్తాన్ నుంచి తమ రాయబారి  సహా దౌత్యాధికారులను వెనక్కి పిలిపించిన ఆఫ్గనిస్తాన్
Talibans

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి తమ దేశ రాయబారి సహా ఇతర దౌత్యాధికారులను ఆఫ్ఘనిస్థాన్ వెనక్కి పిలిపించింది. తమ దేశ రాయబారి నజీబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్ సిలా అలిఖిల్ ని గత శుక్రవారం దుండగులు కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టడంతో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఈ చర్య తీసుకున్నారు. పాక్ లో తమ దేశ రాయబారి, ఇతర దౌత్యాధికారులకు భద్రత ఉండదని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సలహాదారు వహీద్ ఒమర్ తెలిపారు. సిల్ సిలాను కిడ్నాప్ చేసినవారిని వెంటనే పట్టుకుని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ అధ్యక్షుని నిర్ణయాన్ని ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు ఆమ్ రుల్లా సలేహ్ పూర్తిగా సమర్థిస్తూ.. ఈ కిడ్నాప్ ఘటనను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా పరిగణించాలన్నారు. పాకిస్థాన్ లో ఆఫ్ఘన్ జాతీయవాదాన్నే టార్చర్ పెట్టారని ఆయన ఆరోపించారు. ఇది సహించరాని విషయమన్నారు.ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటనలో ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. సిల్ సిలా కిడ్నాప్ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం దుండగులను పట్టుకునే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలని డిమాండ్ చేసింది.

కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన సిల్ సిలా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే కారులో ఆమెపై దాడి జరిగిందని, ఆఫ్గనిస్తాన్ రాయబారికికి, ఆయన కుటుంబానికి భద్రత పెంచామని పాక్ ప్రభుత్వం తెలిపింది. కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఇద్దరు టాక్సీ డ్రైవర్లను అరెస్టు చేసినట్టు పాక్ అధికారులు తెలిపారు. ఇలా ఉండగా తాలిబన్లు ఇంకా ఆఫ్ఘానిస్తాన్ లో చెలరేగిపోతున్నారు. మరిన్ని ప్రాంతాలను వారు ఆక్రమించుకున్నట్టు సమాచారం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది సహా జైషే తోయిబా టాప్ కమాండర్ అబూ అక్రమ్ మృతి..

Sadhguru: బైక్‌ రైడర్‌గా మారిన జగ్గీవాసుదేవ్‌..!! చూస్తే అవాక్కే..!! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu