Chandrababu: భగ్గమంటున్న ‘జల’ వివాదం.. అయినా నోరు మెదపని చంద్రబాబు.. అసలు కారణం అదేనా?..

Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా స్పందించకుండా సైలెంట్ అయ్యారు.

Chandrababu: భగ్గమంటున్న ‘జల’ వివాదం.. అయినా నోరు మెదపని చంద్రబాబు.. అసలు కారణం అదేనా?..
Cbn
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 19, 2021 | 1:41 PM

Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా స్పందించకుండా సైలెంట్ అయ్యారు. అధికార వైసీపీ చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ.. టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని ఎటాక్ చేస్తోంది. అయినప్పటికీ ఈ వివాదంపై ఆయన నోరు మెదపడం లేదు. ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆ మౌనం వెనుక కారణం ఏంటి? అధికార పక్షమే ఆయన సైలెంట్‌కు కారణమా? అసలు వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రతి విషయానికి స్పందిస్తారు. చిన్న ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టకుండా వైసీపీ ప్రభుత్వంపై ఒక రేంజ్ లో విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటిది.. రెండు రాష్ట్రాల నీటి వివాదంపై ఎక్కడా నోరు విప్పకుండా సైలెంట్ అయ్యారు. ఒకరిద్దరు పార్టీ నేతలతో ముక్తసరిగా మాట్లాడిస్తున్నారు తప్పా.. తాను ఎక్కడా మాట్లాడటం లేదు.

అసలు చంద్రబాబు సైలెంట్ గా ఉండటానికి కారణం ఏంటి?.. రాజకీయ వర్గాల్లో ఇపుడు ఇదే ప్రశ్న వస్తోంది. అయితే, వ్యూహాత్మకంగానే చంద్రబాబు మౌనం పాటిస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు అధికార వైసీపీ నేతలు మాత్రం పొరుగు రాష్ట్రంతో గొడవలు పెట్టుకోమని.. ఎంత రెచ్చగొట్టినా.. రెచ్చిపోకుండా.. సంయమనం పాటిస్తామని అంటున్నారు. ఇదే సమయంలో మంత్రులు, వైసీపీ నేతలు.. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఏటాక్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. తెలంగాణలో అన్ని పార్టీలు ఒక మాటపై ఉంటే.. ఏపీ లో ప్రతిపక్ష టీడీపీ వైఖరి తెలంగాణకు అనుకూలంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. జల జగడంపై అసలు చంద్రబాబు వైఖరి ఏంటని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నేతలు.

ఇంత విమర్శలు వస్తున్నా టీడీపీ అధినేత మాత్రం మౌనంగా నే ఉంటున్నారు. దానికి కూడా కారణం ఉందంటున్నాయి టీడీపీ శ్రేణులు. టీడీపీ హయాంలో ఇద్దరు సీఎం లు, ఇరిగేషన్ అధికారులు, మాట్లాడుకొని ఒప్పందం చేసుకున్నారని, ఆ తర్వాత వివాదాలు రాలేదని, ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఎందుకు వస్తుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉందని, వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదం సృష్టించారని టీడీపీ ఆరోపిస్తోంది. వారు వారు బాగానే ఉన్నప్పుడు.. మనం ఎందుకు వేలు పెట్టాలని టీడీపీ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మౌనం వహిస్తున్నారట. ఇదిలాఉంటే.. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో ఏముంది?.. ఏపీ ప్రయోజనాలు ఏంటి?.. ఏపీకి లాభమా నష్టమా?.. అనే విశ్లేషణ చంద్రబాబు చేస్తున్నారట. కూర్చొని మాట్లాడుకునే విషయాన్ని కేంద్రం చేతిలో పెట్టారని, భవిష్యత్ లో రైతాంగానికి, ఏపీ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగేలా చేశారని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో జల జగడానికి సంబంధించిన ఈ ఎపిసోడ్ ఎంత వరకు సాగుతుందో.. జరుగుతున్న పరిణామాలను చూస్తూ.. సమయం వచ్చినప్పుడు చంద్రబాబు మాట్లాడుతారని పసుపు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూసి.. ఆ తర్వాతే చంద్రబాబు రియాక్ట్ అవ్వాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Also read:

Corona Effect: కరోనాకు భయపడి ఇంట్లోనే కాలకృత్యాలు, నిద్రాహారాలు.. తూర్పు గోదావరి జిల్లాలో విచిత్ర ఘటన..

Viral Video: బుడి బుడి అడుగులతో గున్న ఏనుగు అల్లరి.. ఈ వీడియో చూస్తే మీ బాల్యం గుర్తుకు రావడం ఖాయం..

Fine: మొక్కలను తిన్న గొర్రెలు.. యజమానికి 1000 రూపాయల జరిమానా.. ఇదేంటని నిలదీసిన ప్రజలు..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట