CM Jagan Polavaram Visit: పోలవరం ప్రాజెక్ట్‌లపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఏరియల్ సర్వే ద్వారా స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్ పరిశీలన
గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్‌లపై సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ప్రాజెక్ట్ సైట్ దగ్గరకు వెళ్లి పరిస్థితిని స్వయంగా చూశారు.
AP CM YS Jagan Polavaram Project tour: గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్‌లపై సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ప్రాజెక్ట్ సైట్ దగ్గరకు వెళ్లి పరిస్థితిని స్వయంగా చూశారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్ దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం ఎంత వరద వస్తోంది, ఎంత వరకు వెళ్లొచ్చు, వరదతో ఆటంకం లేని పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న దానిపై సమీక్ష చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
స్పిల్‌వేపైకి వెళ్లి దాదాపు అరగంటసేపు అధికారులతో మాట్లాడారు. ఫొటో ఎగ్జిబిషన్ దగ్గర మ్యాప్‌ల ద్వారా ప్రాజెక్ట్ పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే 20 నిమిషాలు ఉన్నారు. జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలారావు, ENC నారాయణరెడ్డి పనుల తీరును ముఖ్యమంత్రికి వివరించారు. అంతకు ముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్‌ను పరిశీలించారు ముఖ్యమంత్రి జగన్.
పోలవరంలో హెలికాఫ్టర్ దిగిన వెంటనే అక్కడే ఉన్న నిర్వాసితులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. వరద పరిస్థితిని, తమ ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకొచ్చారు నిర్వాసితులు. వాళ్లు చెప్పిన విషయాన్నింటినీ విన్నారు సీఎం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించి, అనంతరం పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఇక, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు.
Read Also… L Ramana – KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎల్ రమణ ప్రశంసల జల్లు.. కారణమేంటంటే..