Ashada Masam: వెయ్యి కిలోల చేపలు.. అత్తింటి ‘సారె’ చూసి అల్లుడి కళ్లు బైర్లు కమ్మేసాయంతే..
Ashada Masam: తెలుగువారి సంప్రదాయం ప్రకారం.. తల్లిదండ్రులు తమ అమ్మాయికి పెళ్లి చేసి అత్తింటికి సాగనంపేటప్పుడు..
Ashada Masam: తెలుగువారి సంప్రదాయం ప్రకారం.. తల్లిదండ్రులు తమ అమ్మాయికి పెళ్లి చేసి అత్తింటికి సాగనంపేటప్పుడు కానుకలు పంపిస్తుంటారు. వారి స్తోమతను బట్టి స్వీట్లు, పిండి వంటకాలు, ఇంటి సామాగ్రి తదితర వస్తువులు పంపిస్తారు. అయితే, ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తన కుమార్తెకు ‘సారె’గా భారీ కానుకలే పంపించాడు. ఎవరూ ఊహించని రీతిలో సరేలేరు నీకెవ్వరు అనిపించుకునేలా.. ‘సారె’ కానుకలను అల్లుడికి పంపించారు. మేకపోతులు, కోడిపుంజులు, బొమ్మిడాయిలు, ఆవకాయ జాడీలు అబ్బో.. చెప్పుకుంటూ పోతే చేంతాడంత లీస్ట్ అవుతుందనే చెప్పాలి.
వివరాల్లోకెళితే.. యానాం కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామ కృష్ణ కుమార్తె ప్రత్యూష తో ఇటీవల వివాహం జరిగింది. ఆషాఢం నేపథ్యంలో రాజమహేంద్రవరం లోని పెళ్లి కుమార్తె ఇంటి నుండి యానాం లోని పెళ్లి కుమారుడు ఇంటికి ఆషాఢం కావిళ్ళు( సారె) పంపించారు. ఆ సారెను చూసి అత్తింటి వారు అవాక్కయ్యారు. బలరామ కృష్ణ తన కూతురికి ఇప్పటి వరకు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో సారెను పంపించాడు. వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్‌లతో వస్తువులను పంపించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యానాం వచ్చిన ఈ ఆషాడం కావిళ్ళు ఊరేగింపుగా పెళ్లి కుమారుడు ఇంటికి తీసుకువచ్చారు. స్థానికులు వాటిని చూసి ఆశ్చర్యపోయారు. కనీవినీ ఎరుగని కావిళ్ళు చాలా కళ్లముందు కనువిందు చేయడంతో బత్తుల, తోట వార్ల కావిళ్ళు గురించే అంతా చర్చించుకుంటున్నారు.
Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వదిలిపెట్టరు.. !! వీడియో
Heart Problem: యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. ఈ పద్దతులు మార్చుకుంటే సులువుగా బయటపడొచ్చు..