AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

L Ramana – KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎల్ రమణ ప్రశంసల జల్లు.. కారణమేంటంటే..

L Ramana - KCR: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీ నేత ఎల్. రమణ ప్రశంసలు కురిపించారు.

L Ramana - KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎల్ రమణ ప్రశంసల జల్లు.. కారణమేంటంటే..
L Ramana
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 19, 2021 | 1:44 PM

L Ramana – KCR: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీ నేత ఎల్. రమణ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. దేశంలోనే మొదటిసారిగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షించదగిన విషయం అన్నారు. దళిత పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు అని అన్నారు. ఈ పథకం ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా అమల్లోకి రావాలని రమణ ఆకాంక్సించారు. ఈ ‘దళిత బంధు’ పథకం చరిత్రలో గొప్ప మైలు రాయిగా నిలిచిపోతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా సీఎం కేసీఆర్ తర తరాలకు గుర్తిండిపోతారని అన్నారు. ఈ పథకాన్ని కరీంనగర్, హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి రమణ కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ నుంచి ప్రారంభించిన ‘రైతు బంధు’ పథకం విజయవంతం అయినట్లుగానే ‘దళిత బంధు’ పథకం కూడా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు.

ఇటీవలి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఎల్ రమణ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. తొలుత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్న రమణ.. రెండు రోజుల వ్యవధి తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి అవడం, గతంలో కేసీఆర్‌తో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో.. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది.

Also read:

Chandrababu: భగ్గమంటున్న ‘జల’ వివాదం.. అయినా నోరు మెదపని చంద్రబాబు.. అసలు కారణం అదేనా?..

Corona Effect: కరోనాకు భయపడి ఇంట్లోనే కాలకృత్యాలు, నిద్రాహారాలు.. తూర్పు గోదావరి జిల్లాలో విచిత్ర ఘటన..

Viral Video: బుడి బుడి అడుగులతో గున్న ఏనుగు అల్లరి.. ఈ వీడియో చూస్తే మీ బాల్యం గుర్తుకు రావడం ఖాయం..