Revanth Reddy: హౌస్ అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి.. తన హక్కులకు భంగం కలిగించారంటూ..
Revanth Reddy: హైదరాబాద్ పోలీసులు తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy: హైదరాబాద్ పోలీసులు తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరెస్ట్ పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా అడ్డుకుని తన హక్కులకు భంగం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కోకాపేటలో భూముల వేలంలో కుంభకోణం జరిగిందని, దానికి సంబంధించిన అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తకుండా తనను అడ్డుకున్నారంటూ లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు తనను కుట్రపూరితంగా గృహ నిర్భంధం చేశారని ఆరోపించారు.
కాగా, కోకాపేట భూముల వేలంలో భారీ కుంభకోణం జరిగిందని టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇవాళ కోకాపేటలో వేలం వేసిన భూముల దగ్గర నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ప్లాన్ వేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. రేవంత్ రెడ్డి సహా, కాంగ్రెస్ ముఖ్య నేతలు, పొన్నా లక్ష్మయ్య, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కూడా పోలీసులు గృహనిర్భంధం చేశారు.
కాగా, రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణలో నిర్బంధ పాలన సాగుతోందని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రేవంత్ అరెస్ట్‌పై ఆయన అనుచరులు ఫైర్ అయ్యారు. ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. నిర్బంధాలతో తమను అడ్డుకోలేరని కాంగ్రెస్ శ్రేణులు నినదించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
Also read:
Janasena Party: రూ. 30 కోట్ల స్కామ్ అంటూ మంత్రులపై ఆరోపణలు.. ప్రమాణం చెయ్యాలంటూ జనసేన నేత సవాల్..
Hyderabad: అమీర్‌పేట్‌లో దారుణం.. ‘నా ప్రాణం నువ్వు’ అంటూనే తన ప్రాణం తీసుకున్న యువకుడు..
L Ramana – KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎల్ రమణ ప్రశంసల జల్లు.. కారణమేంటంటే..