నిజామాబాద్‌లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల ప్రక్రియ‌

నిజామాబాద్ లోక్‌సభకు పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. అక్కడ ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం తాము ఏర్పాట్లపైనే దృష్టి పెట్టామని, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్‌కు ఎన్ని రోజులు పడుతుందో తెలియదని చెప్పారు. తమకు అందుబాటులో ఉన్న వనరులు, తదితర అంశాలపై చర్చిస్తున్నామని అన్నారు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత కూడా 17 స్థానాల్లో 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రజత్ […]

నిజామాబాద్‌లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల ప్రక్రియ‌
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 29, 2019 | 7:54 PM

నిజామాబాద్ లోక్‌సభకు పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. అక్కడ ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం తాము ఏర్పాట్లపైనే దృష్టి పెట్టామని, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్‌కు ఎన్ని రోజులు పడుతుందో తెలియదని చెప్పారు. తమకు అందుబాటులో ఉన్న వనరులు, తదితర అంశాలపై చర్చిస్తున్నామని అన్నారు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత కూడా 17 స్థానాల్లో 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రజత్ కుమార్ వెల్లడించారు.