విశాఖ సాగర తీరంలో జన సునామీ రాబోతుంది.. జగన్ బస్సు యాత్రకు సర్వం సిద్దం..
మేమంతా సిద్దం బస్సుయాత్ర 20వ రోజుకు చేరుకుంది. విశాఖలో బస్ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వైఎస్ఆర్సీపీ వర్గాలు. రాత్రి బస చేసిన చిన్నయపాలెం క్యాంప్ ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సుయాత్ర ప్రారంభంకానుంది. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకోనున్నారు సీఎం జగన్.

మేమంతా సిద్దం బస్సుయాత్ర 20వ రోజుకు చేరుకుంది. విశాఖలో బస్ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వైఎస్ఆర్సీపీ వర్గాలు. రాత్రి బస చేసిన చిన్నయపాలెం క్యాంప్ ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సుయాత్ర ప్రారంభంకానుంది. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకోనున్నారు సీఎం జగన్. గోపాలపట్నం, ఎన్ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద రాత్రి బస చేయనున్నట్లు సీఎం జగన్ బస్సుయాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు వైసీపీ నేతలు. విశాఖ వెస్ట్‌లో ప్రవేశించి నార్త్, ఈస్ట్ నియోజకవర్గాల మీదుగా భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది ఈ బస్సు యాత్ర. నదులు సముద్రంలో కలవడం చూసే ఉంటాం. కానీ సముద్రంలో సముద్రం కలిస్తే ఎట్టా ఉంటది.. అది ఇవాళ విశాఖలో చూడబోతున్నాం అంటోంది వైసీపీ. ఉత్తరాంధ్రలో జగన్ ప్రభంజనానికి సంబంధించి ట్రైలర్ నిన్న అనకాపల్లిలో చూశాం.. మరోసారి ఇవాళ సాగర తీరంలో ప్రజా ఘోష రూపంలో వినిపించబోతోంది అంటున్నాయి వైసీపీ వర్గాలు. శనివారం అనకాపల్లికి మించి ఆదివారం వైజాగ్‌లో విజన్ ఆవిష్కృతం కాబోతోందా? మరి కొద్ది గంటల్లో విశాఖ తీరాన్ని జన సునామీ తాకబోతోందని రాజకీయ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
అసలు విశాఖ మీద వైసీపీకి ఎందుకింత స్పెషల్ ఫోకస్? వై నాట్ 175 అని గర్జిస్తోంది వైసీపీ కేడర్. బోర్డులు, ప్లకార్డులు పట్టుకుని అడుగో అతడే అర్జునుడు అంటూ నినదిస్తోంది వైసీపీ సైన్యం. ప్రతిపక్షాల పద్మవ్యూహాన్ని ఛేదించే ధీరుడు అంటూ వైసీపీ దండు కదులుతోంది. మేము, మా బూత్ సిద్ధం అంటున్నాయి వైసీపీ శ్రేణులు. నాకో కల ఉంది. అది కలగానే మిగిలిపోదు. జగనన్న సాకారం చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనం. ఇవన్నీ అనకాపల్లి సభలో కనిపించి, అబ్బుర పరిచిన దృశ్యాలు. విశాఖలో సాగర ఘోష. ఇవాళ దానిని మించిపోనున్న జన ఘోష. రెండు సముద్రాలు పోటీ పడే అరుదైన దృశ్యం.. సీఎం జగన్ బస్సు యాత్రలో కళ్లకు కడుతుంది అని ధీమాగా చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విశాఖ రోడ్ షో.. షోలే లెవెల్లో ఉంటుదంటున్నారు వైసీపీ లీడర్లు, కేడర్. విశాఖ తీరంలో జగన్ తుఫాన్ వస్తోందంటోంది. మూడు రాజధానుల కేటగిరీలో విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అధికార పక్షం. విశాఖలో సీఎం జగన్ రోడ్ షోను వైసీపీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి.
2019లో జగన్ వేవ్‌తో 175 అసెంబ్లీ సీట్లకు 151 గెలిచినా.. విశాఖ నగరంలో విజయకేతనం ఎగురవేయలేకపోయింది వైసీపీ. నగరం నలుదిక్కులా ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లు.. విశాఖ సౌత్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ ఈస్ట్.. ఈ నాలుగు సీట్లలో గెలవలేకపోయింది వైసీపీ. అయితే ఈసారి నగరంలోని 4 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. శనివారం అనకాపల్లి సభకే జనం భారీగా పోటెత్తారు. అంతకు మించి, విశాఖను జనసంద్రంగా మార్చి జనం హృదయాలను గెలిచేందుకు వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకు కదులుతోంది. ఈ జన సునామీతో.. ఔర్ ఏక్ ధక్కా.. 4 సీట్లు పక్కా అంటోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో.. వైఎస్సార్‌సీపీ 28 సీట్లను సాధించింది. విశాఖ సిటీలోని 4 సీట్లు, శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఇచ్ఛాపురం సీట్లు మాత్రమే జగన్ పార్టీకి కొరుకుడు పడలేదు. ఈసారి వైనాట్ 175 వ్యూహంలో భాగంగా వీటన్నింటిని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది అధికార పక్షం. ఇక విశాఖను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించింది అధికార వైసీపీ. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనేది వైసీపీ వాదన. విశాఖకు తాము ఇంత ప్రాధాన్యత ఇస్తుంటే, ప్రజలు మద్దతు ఎందుకు ఇవ్వరని అడిగే వ్యూహం దీనిలో కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. విశాఖకు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అంటోంది వైసీపీ.
ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్.. అభివృద్ధి అనే పట్టాలపై శరవేగంగా దూసుకుపోవాలంటే, దానికి విశాఖ అనే గ్రోత్ ఇంజన్‌ని తగిలించాలంటోంది వైసీపీ. విశాఖ అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. అందుకే జగన్ సర్కార్.. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా, దాన్ని విశాఖ వేదికగానే విజయవంతం చేసే ప్రయత్నం చేస్తోందంటున్నారు అనలిస్టులు. తొలి సిద్ధం సభను కూడా భీమిలి లోనే నిర్వహించింది వైఎస్సార్‌సీపీ. ఇక తాను గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు. వీటన్నింటికి తోడుగా విజన్ విశాఖ పేరుతో భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం కోసం రిషికొండ పై భారీ నిర్మాణాలు చేపట్టారు. విశాఖను టైర్- 1 సిటీ గా మార్చాలనే ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి..ఓ మహానగరం మనకు లేకపోతే….రాష్ట్రం అభివృద్ది చెందదని చెబుతున్నారు. విశాఖను గ్రోత్ ఇంజన్‌గా మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాలు, వ్యూహాల దృష్ట్యా, విశాఖలో జగన్ రోడ్ షోకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది వైసీపీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




