AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్.. అనుమానితుడిని వదిలేసిన పోలీసులు.. అసలు కారణం ఇదే..

సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు. ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసి అర్ధరాత్రి ఇంటి వద్ద విడిచి పెట్టారు. మేమంతా సిద్దం బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో సీఎం జగన్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు కొందరు ఆగంతకులు.

సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్.. అనుమానితుడిని వదిలేసిన పోలీసులు.. అసలు కారణం ఇదే..
Cm Jagan
Srikar T
|

Updated on: Apr 21, 2024 | 6:50 AM

Share

సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు. ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసి అర్ధరాత్రి ఇంటి వద్ద విడిచి పెట్టారు. మేమంతా సిద్దం బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో సీఎం జగన్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు కొందరు ఆగంతకులు. దీనిపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు 20 ప్రత్యేక పోలీసు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టాయి. సెల్ ఫోన్ లొకేషన్, కాల్ డేటా, ఘటనా స్థలంలో సేకరించిన మూడు రాళ్లపై ఉన్న వేలిముద్రలు అధారంగా దర్యాప్తు చేపట్టాయి. ఇందులో ఏ1గా సతీష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం సతీష్‌ నెల్లూరు సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.

అయితే సతీష్ రిమాండ్ రిపోర్ట్‎లో A2 ప్రోద్బలం తోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఏ2 ఎవరన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. అందులో భాగంగానే అనుమానితుడుగా ఉన్న దుర్గారావును విచారణకు తీసుకెళ్లారు. అయితే విచారణ తరువాత అతనికి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని భావించిన పోలీసులు శనివారం అర్థరాత్రి ఆయనను తన ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ కేవలం విచారణ నిమిత్తం దుర్గారావును తీసుకెళ్లామని ఎలాంటి సంబంధం లేదని తెలిసి వదిలిపెట్టామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏ2 ఎవరా అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విచారణ ముమ్మరం చేశామని త్వరలోనే ఈ హత్యకు ఉసిగొల్పిన వారిని పట్టుకుంటామంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..