AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: దేశాన్ని కబళిస్తన్న కరోనా మహమ్మారి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ 3 కీలక సమావేశాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్ష

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతోన్నారు.

PM Modi: దేశాన్ని కబళిస్తన్న కరోనా మహమ్మారి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ 3 కీలక సమావేశాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్ష
Pm Modi
Balaraju Goud
|

Updated on: Apr 23, 2021 | 7:57 AM

Share

PM Narendra Modi Crucial Meetings:  దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతోన్నారు. కరోనా కట్టడికి నేడు ప్రధాని మోదీ మూడు సమావేశాలు ఏర్పాటు చేశారు. అధికారులతో కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే ఆక్సిజన్ సమస్యపై ప్రధాని మోదీ పారిశ్రామికవ్త వేత్తలతో సమావేశం కానున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ర్యాలీలను కూడా ప్రధాన నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు.

దేశం నలుమూలాల విరుచుకుపడుతున్న ఆ మహమ్మారిని నియంత్రించేదెలా..? ఆ రక్కసి నుంచి ప్రజలను రక్షించేదెలా..? ఇదే ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న పెను సవాల్‌. కరోనా ధాటికి..కళ్లముందే విలవిలలాడతూ పిట్టల్లా రాలిపోతున్నారు జనం. ఆక్సిజన్‌ అందక పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కరోనా కట్టడిపై ఫోకస్‌ పెట్టారు. ఇవాళ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9గంటలకు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు..10 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఆక్సిజన్‌ తయారీదారులతో ప్రాణ వాయువు ఉత్పత్తిపై చర్చించనున్నారు.

మరోవైపు, మన దేశాన్ని కబళించివేస్తోంది కరోనా మహమ్మారి. కనీవినీ ఎరుగని స్థాయిలో విరుచుకుపడుతోంది. ఎటు చూసినా కన్నీటి కథలే. అత్యంత దయనీయ పరిస్థితులు. రోజువారీ కేసులు 3 లక్షలు దాటిపోయాయి. తాజాగా 24 గంటల్లో 3,32,320 కొత్త కేసులు నమోదయ్యాయి. 2,256 మంది మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,62,57,309కి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య.

అయితే, ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? కరోనా కట్టడికి సంచలన ప్రకటన ఏమైనా చేసే అవకాశముందా..? అన్నది ఇప్పడు దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Read Also…  Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది రోగుల సజీవ దహనం..