West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక ఆదేశాలు.. పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక ఆదేశాలు.. పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం
Eci Bans Road Shows In West Bengal Election
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 23, 2021 | 7:37 AM

West Bengal Assembly Elections: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం విధించింది. అలాగే, బహిరంగ సభలకు 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఆరు విడతల ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఇక, మిగిలిన రెండు విడతల ఎన్నికలకు ఈ ఆంక్షలు వర్తించేలా ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే రోడ్‌ షోలు, వాహనాల ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసి ఉంటే, వాటిని వెంటనే ఉసంహరించుకోవాలని ఈసీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బెంగాల్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీచేసింది.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలంటూ కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఈసీ ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార ర్యాలీలు సూపర్‌స్ప్రెడర్‌ ఈవెంట్లుగా మారవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకోవాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోల్‌కతా హైకోర్టు గురువారం విచారించింది. ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొంటూ ఎన్నికల సంఘం అధికారులు రేపటి విచారణలో నివేదిక సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ నిర్వహణను కుదించాలంటూ పలు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించుకున్నాయి.

Read Also…  Gas Cylinder: గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారి కోసం కొత్త సిలిండర్లు..