- Telugu News Photo Gallery You have to think before eating such potatoes, Check Here is Details in Telugu
Potatoes: ఇలాంటి ఆలుగడ్డలను తినే ముందు ఆలోచించాల్సిందే..
ఆలుగడ్డలతో ఎన్నో రకాల స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. వీటితో ఎన్నో రకాల నోరూరించే రెసిపీలు తయారు చేసుకోవచ్చు. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల డయాబెటీస్ వస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో వీటి వాడకం తగ్గింది. కానీ బంగాళ దుంపల్ని తినే ముందు ఈ విషయాలను ఆలోచించండి..
Chinni Enni | Edited By: Shaik Madar Saheb
Updated on: Jan 12, 2025 | 10:45 PM

చాలా మందికి ఇష్టమైన వాటిల్లో బంగాళ దుంపలు కూడా ఒకటి. చాలా మంది ఎక్కువగానే కొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. వీటితో అనేక రకాలైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. కూరగాయాల్లో ఎక్కువగా నిల్వ ఉండే వాటిల్లో ఆలుగడ్డలు కూడా ఒకటి.

అయితే బంగాళ దుంపలు ఎలా ఉన్నా మంచిదే అని కొనేస్తారు. ఇంట్లో రోజుల తరబడి నిల్వ చేసినవి కూడా వండుతూ ఉంటారు. అయితే ఆలుగడ్డలు అనేవి ఆకు పచ్చగా మారినా, మొలకెత్తినా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇలా మారిన ఆలు గడ్డలు విష పూరితంగా మారతాయని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిని పడేయాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని సూచిస్తున్నారు.

మొలకెత్తిన ఆలు గడ్డల్లో సోలనిన్, చాకోనైన్ అనే గ్లైకో ఆల్కలాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కేవలం ఆలుగడ్డల్లోనే కాదు వంకాయలు, టమాటాల్లో కూడా ఉంటాయి. ఇవి చాలా విష పూరితమైనవి.

వీటిని తినడం వల్ల రక్త పోటు రావడం, పల్స్ వేగంగా కొట్టుకోవడం, గందరగోళంగా ఉండటం, తల నొప్పి, జ్వరం, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మొలకెత్తిన బంగాళ దుంపల్ని మాత్రం అస్సలు తినకూడదు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























