Yoga Benefits: కూర్చొని ఉద్యోగం చేస్తున్నారా.. మెడ నడుము, భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆసనాలు ట్రై చేయండి
యోగా వల్ల మెడ, భుజం, వెన్నునొప్పి తగ్గుతుంది. అలాగే యోగాను రోజువారీగా అలవర్చుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, శారీరకంగా కూడా అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. కండరాల దృఢత్వం, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి. ఈ యోగాసనాలు రోజూ వేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెడ, భుజం , వెన్నునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కూర్చొని ఉద్యోగం చేసేవారిలో కనిపిస్తాయి. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కనుక చలికాలంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే యోగా ఆసనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.