Mouth Problems: నోటి పూత, వాపుతో ఇబ్బంది పడుతున్నారా! ఈ టిప్స్‌తో బైబై చెప్పొచ్చు..
శీతా కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో నోటి సమస్యలు కూడా ఒకటి. నోట్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోతే.. నోటి పూత, పుండ్లు, చిగుళ్ల వాపు, నాలుక పగలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో తినేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ చిట్కాలతో ఆ సమస్యలకు బైబై చెప్పొచ్చు..
Chinni Enni | Edited By: Shaik Madar Saheb
Updated on: Jan 12, 2025 | 10:30 PM

వింటర్ సీజన్‌లో అందరికీ వచ్చే సమస్యల్లో నోటి పూట, వాపు, చిగుళ్ల నొప్పి కూడా ఒకటి. నోటికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పెదవుల లోపల, బయట చిన్న పుండ్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. చిగుళ్లు వాపు కూడా వస్తాయి. దీంతో తినేందుకు, తాగేందుకు ఇబ్బందిగా ఉంటుంది.

నోటి సమస్యలను తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతో చక్కగా పని చేస్తుంది. అర గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి.. నోట్లో వేసుకుని పుక్కిలించి.. ఊసేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే నోటి పూత, చిగుళ్ల వాపు కంట్రోల్ అవుతాయి.

నోటిని సమస్యలను తగ్గించడంతో లవంగాలు కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. చెడు బ్యాక్టీరియాను నశింప చేస్తుంది. ఒక లవంగం నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ రసాన్ని పీల్చుతూ ఉండాలి. దీని వల్ల నోట్లో పుండ్లు, పూత, వాపులు తగ్గుతాయి.

నోటి సమస్యలను తగ్గించడంలో పసుపు ఎంతో చక్కగా పని చేస్తుంది. నీటిలో కొద్దిగా జీలకర్ర, పసుపు వేసి మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసి పుక్కలిస్తే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గి.. సమస్యలు కంట్రోల్ అవుతాయి.

తేనె కూడా నోటి ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేయడంలో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. తేనెలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటి పూత, వాపు వంటి సమస్యలకు ఆయింట్మెంట్‌లా వర్క్ చేస్తుంది. సమస్య ఉన్నచోట తేనె రాస్తూ ఉండాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























