- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Sharvari Will Act With Karthik Aaryan In Tripti Dimri Place in Aashiqui 3
Tritpi Dimri: యానిమల్ బ్యూటీకి ఝలక్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. అసలేం జరిగిందంటే..
దాదాపు పదేళ్లుగా సినీరంగంలో నటిగా కొనసాగుతుంది త్రిప్తి డిమ్రీ. చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ యానిమల్ సినిమాతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది.
Updated on: Jan 12, 2025 | 9:34 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. కానీ తాజాగా త్రిప్తికి ఓ బాలీవుడ్ బ్యూటీ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆమె మరెవరో కాదు. ఇప్పుడిప్పుడే హిందీ చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటున్న శార్వరీ. అసలు విషయానికి వస్తే.. హిందీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ఆషికీ. ఇప్పటివరకు వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి.

ఈ హిట్ ఫ్రాంచైజీ కావడంతో ఆషికీ 3ని సైతం మేకర్స్ ప్రకటించారు. అయితే 2022లోనే ఈ చిత్రాన్ని ప్రకటించగా.. ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట.

అయితే ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీలను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారట మేకర్స్. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నట్లు టాక్. కానీ ఈ సినిమా విషయంలో నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చాయట.

దీంతో ఈసినిమా స్టార్ట్ కావడానికి మరికొంత సమయం పట్టనుందట. ఈ సినిమా నుంచి అటు త్రిప్తిని తప్పించి బాలీవుడ్ బ్యూటీ శార్వరీని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అషికీ 3లో కార్తీక్ ఆర్యన్ సరసన శార్వరీ కనిపించనుందని టాక్.




