- Telugu News Photo Gallery Cinema photos Guess The Side Actress in This Photo , She Is HanuMan Movie Fame Amritha Aiyer
Tollywood: ఇదెక్కడి ట్విస్ట్ రా మామ.. అప్పుడు సైడ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. గ్లామర్ వయ్యారి ఎవరంటే..
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లుగా వెలిగిపోతున్న ముద్దుగుమ్మలు.. ఒకప్పుడు సైడ్ ఆర్టిస్టులే. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత అవకాశాలను అందిపుచ్చుకుంటూ అందం, అభినయంతో హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ సైతం ఒకరు.
Updated on: Jan 12, 2025 | 8:10 PM

సూపర్ స్టా్ర్ రజినీకాంత్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన లింగ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇందులో అనుష్క శెట్టి సైతం నటించిన సంగతి తెలిసిందే. లింగ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్.

ఆమె మరెవరో కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు వందల కోట్లు కొల్లగొట్టిన మూవీ హీరోయిన్. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. హీరోయిన్ అమృత అయ్యర్. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో పోషించింది.

ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అమృత అయ్యార్ పదైవీరన్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. అలాగే రామ్ పోతినేని జోడిగా రెడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

అలాగే యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.? అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అర్జున ఫల్గుణ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి హనుమాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొత్తంగా 300కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో అమృతకు సైతం గుర్తింపు వచ్చింది.




