- Telugu News Photo Gallery Cinema photos Daaku maharaaj producer naga vamsi revealed about success meet place
Daaku Maharaaj: డాకు మహారాజ్’ సక్సెస్ ఈవెంట్ అక్కడే చేస్తామంటున్న నాగవంశీ
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.. తెల్లవారు జాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది.
Updated on: Jan 12, 2025 | 4:42 PM

'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించబోతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు.

బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది.

ఇది ఇలా ఉంటే త్వరలోనే సక్సెస్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన అనంతపురంలోనే సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు.

ఆదివారం విడుదలైన ఆ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో ఆయన మాట్లాడారు. నాగవంశీతోపాటు దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా విలేకరుల సమావేశంలో పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు.




