- Telugu News Photo Gallery Cinema photos Do you know about Ananya Sharma who acted in the movie Game Changer?
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ పెంపుడు చెల్లిగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
బ్యూటీ, యూట్యూబ్ స్టార్ అనన్య శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె చాయ్ బిస్కెట్, బాయిస్ ఫార్ముల ఛానెల్స్‌లోని షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌లో ఈమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
Updated on: Jan 12, 2025 | 2:45 PM

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్‌కే పరిమితం అయ్యింది. దీంతో మెగా అభిమానులకు కాస్త నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ పెంచిన చెల్లి పాత్రలో 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ఫేమ్ అనన్య శర్మ నటించారు. ఈమె సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారనే చెప్పవచ్చు.

అయితే అనన్య శర్మ గురించి చాలా మందికి తెలియదు.కాగా, ఈమె గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం

అనన్య శర్మ వరంగల్ అమ్మాయి. ఈ చిన్నది చెన్నైలోని వీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంది. ఇక ఈమెకు తన చిన్నతనం నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో, యూట్యూబ్ చానెల్‌లో నటించడానికి చాలా టై చేసింది. ఇక ఒక చిన్న అవకాశం రావడంతో ఈ బ్యూటీ తన నటనతో అభిమానుల మనసు దోచుకొని యూట్యూబ్ స్టార్‌గా మారిపోయింది.

దీంతో ఈ అమ్మడుకు వరసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాలో కనిపించి మెప్పించిన బ్యూటీ, గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది.