పెళ్లిలో ఏడడుగులు వేస్తుండగా ఊడిపోయిన వరుడి లుంగీ.. తరువాత..
సోషల్ మీడియాలో రోజూ కొన్ని వందల ఫన్నీ వీడియోస్ అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉండి వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. పెళ్లి తంతు జరుగుతుండగా అందరి ముందు వరుడి లుంగీ ఊడిపోయింది. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ట్విటర్‌లో ఈ వీడియో షేర్ అయింది.
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మండపంలో వివాహ వేడుక జరుగుతోంది. వధువు నుదుట వరుడు తిలకం దిద్దిన తర్వాత వధూవరులిద్దరూ పెళ్లి తంతులో భాగంగా ఏడడుగులు వేస్తున్నారు. వరుడి చిటికెన వేలు పట్టుకుని వధువు నడుస్తూ ఉంటుంది. తొలి రౌండ్ పూర్తి కాగానే వరుడి లుంగీ జారి కిందపడిపోయింది. దీంతో చుట్టు పక్కల ఉన్న వారందరూ ఘొల్లుమని నవ్వుకున్నారు. వరుడు సిగ్గుపడి వెంటనే లుంగీ తీసి కట్టుకున్నాడు. ఆ ఘటనను రికార్డు చేసిన వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. పాపం.. పరువంతా పోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. లుంగీ కట్టుకుంటే అలాంటి ఇబ్బందులు తప్పవు. పాపం.. పెళ్లిలో ఇలా జరగడం ఘోరం అంటూ నవ్వుకుంటున్నారు.

సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ

కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..

భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో

రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..
