Chicken Majjiga Pulusu: చికెన్ మజ్జిగ పులుసు.. వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా!

ఇంట్లో చికెన్ కర్రీ చేసినప్పుడు లేదా చికెన్ కర్రీ మిగిలిపోయినప్పుడు ఇలా చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే.. ఆహా భేలాగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ..

Chicken Majjiga Pulusu: చికెన్ మజ్జిగ పులుసు.. వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా!
Chicken Majjiga Pulusu
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 12, 2025 | 9:47 PM

ఎప్పుడూ ఒకేలా చేసుకుని బోర్ కొడుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు వంటలు కాస్త వెరైటీగా చేస్తూ ఉండాలి. చికెన్ అంటే అందరికీ ఇష్టమే. చికెన్ కర్రీస్ తయారు చేస్తూ ఉంటారు. ఇంట్లో చికెన్ కర్రీ చేసినప్పుడు లేదా చికెన్ కర్రీ మిగిలిపోయినప్పుడు ఇలా చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే.. ఆహా భేలాగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. మరి ఈ చికెన్ మజ్జిగ పులుసు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.

చికెన్ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాళింపు దినుసులు, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, నెయ్యి.

చికెన్ మజ్జిగ పులుసు తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని సెమీ గ్రేవీ కర్రీతో వండుకోవాలి. ఈ కర్రీ వండుకుని పక్కన పెట్టుకోండి. ఇంట్లో చికెన్ కర్రీ మిగిలినా పర్వాలేదు. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి వేడి చేయండి. ఇందులో తాళింపు దినుసులు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు ఉడికించాలి. ఆ నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి అంతా మిక్స్ చేయండి. ఆ తర్వాత చికెన్ వేసి అంతా ఒకసారి కలిపి ఓ ఐదు నిమిషాలు ఉడికించండి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత.. కలిపి పెట్టుకున్న మజ్జిగ వేసి అంతా మిక్స్ చేయండి. ఓ నిమిషం పాటు వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ మజ్జిగ పులుసు సిద్ధం.