Telangana: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి!
నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యులు మందా జగన్నం కన్నుమూశారు. గత కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాలుగు సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా మందా జగన్నాథం ప్రాతినిథ్యం వహించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా పని చేశారు.
నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యులు మందా జగన్నం కన్నుమూశారు. గత కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాలుగు సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా మందా జగన్నాథం ప్రాతినిథ్యం వహించారు. 1996లో ఆయన తొలిసారిగా టీడీపీ తరఫున నాగర్‌కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం టికెట్‌పై విజయం సాధించారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022, జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్ ఆయనను నియమించారు. 2023 నవంబర్ 17న బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాగర్‌కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.
కుటుంబ నేపథ్యంః
ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కుమార్తె – మంద పల్లవి. మెడికల్ కోర్సు M.S ప్రసూతి, గైనకాలజీ (లేడీస్ స్పెషలిస్ట్) లో ప్రభుత్వంలో పని చేస్తున్నారు. పెద్ద కొడుకు మంద శ్రీనాథ్ బీటెక్ (మెకానికల్ ఇంజనీర్) చదివా.రు సోషల్ వర్కర్ గా వున్నారు. చిన్న కొడుకు మంద విశ్వనాథ్ MBBS చదివి తన వృత్తిలో కొనసాగుతున్నారు. తండ్రి మంద పుల్లయ్య, తల్లి మంద సవరమ్మ. తండ్రి పుల్లయ్య నాగార్జున సాగర్‌లోని పైలాన్ కాలనీలో మెకానికల్ విభాగంలో వాచ్‌మెన్‌గా పనిచేసినారు. తల్లి సవరమ్మ నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలో ఆఫీస్ అటెండెంట్‌గా పనిచేశారు.
విద్యాభాసం
నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి నుంచి 4వ తరగతి వరకు చదివారు. 6 నుంచి 8వ తరగతి వరకు నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలోని హైస్కూల్‌లో చదివారు. 9, 10వ తరగతులను వరంగల్ జిల్లా సంగంలోని ZPHSలో కొనసాగించారు. వికారాబాద్‌లోని జెడ్‌పి హైస్కూల్‌లో HSC పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నిజాం కళాశాలలో PUC చదివారు. ఆ తర్వాత MBBS కోర్సులో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరారు. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్‌డిఎల్‌ఓ, ఇఎన్‌టి స్పెషలిస్ట్ సర్జన్ కోర్సు చేశారు. సూర్యాపేటలోని సివిల్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 8వ BN APSPలో పోలీస్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో, హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఈఎన్‌టీ సర్జన్‌గా పనిచేశారు.
అంచెలంచెలుగా ఎదిన మందా జగన్నాథం
పాఠశాలలో చదువుతున్న రోజుల్లో ప్రతిరోజూ సాయంత్రం క్లబ్ హిల్ కాలనీలో టెన్నిస్ బాల్ పికప్ బాయ్‌గా పనిచేశారు మంద జగన్నాథం. పేద కుటుంబానికి చెందిన జగన్నాథం పాఠశాల ఖర్చులకు వేసవి సెలవుల్లో నాగార్జున సాగర్ డ్యామ్‌లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో వాటర్ బాయ్‌గా పనిచేశారు. కొన్నిసార్లు వేసవి సెలవుల్లో రోజుకు 0.50 పైసల స్వల్ప రోజువారీ కూలీకి నాగార్జున సాగర్ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేశారు. కానీ చదువులకు, తరగతిలో ర్యాంకింగ్‌లకు ఆటంకం కలిగించలేదు మంద జగన్నాథం. తరగతిలో ఎల్లప్పుడూ టాప్ స్కోరర్‌గా నిలిచారు.
రాజకీయ రంగ ప్రవేశం:-
1996లో నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరిన మంద జగన్నాథం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ (లోక్‌సభ) సభ్యునిగా పోటీ చేసి తొలిసారిగా ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా (లోక్‌సభ) ఎన్నికయ్యారు. 1996 – 11వ లోక్‌సభకు (టిడిపి) ఎన్నికయ్యారు. 1999 – 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం) (TDP) 2004 – 14వ లోక్‌సభకు (3వసారి) తిరిగి ఎన్నికయ్యారు (TDP) 2009 – 15వ లోక్‌సభకు (4వ పర్యాయం) తిరిగి ఎన్నికయ్యారు (కాంగ్రెస్) 2014 – TRS పార్టీ నుండి పోటీ చేసి కార్ గుర్తు లో పోలిక ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి వల్ల సల్ప మెజారిటీతో ఓడిపోయారు.. 2018 – న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధిగా కేబినెట్ హోదాలో నామినేట్ అయ్యారు. (9 జూన్ 2018 – 8 జూన్ 2019)
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..