Inavolu: ఘనంగా ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు

తెలంగాణ శ్రీశైలంలో జాతరకు తెరలేచింది. ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గజ్జల సవ్వడి..ఢమరుక రువ్వడి.. పట్నాలు..భక్త నీరాజనాలతో ఎటు చూడూ సందడే సందే. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల మల్లన్నకు ప్రణమిల్లుతున్నారు భక్తులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Inavolu: ఘనంగా ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
Mallanna Jatara
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2025 | 12:13 AM

ఘల్లు ఘల్లు గజ్జెల మోత.. నుదిటిపై బండారి…పట్నాల సందడి… మల్లన్న జాతరకు  తెర లేచింది.. తెలంగాణ పల్లెల్ని ఒక్కచోటే చోర్చే ఆధ్మాత్మిక వేడుక..మల్లన్న జాతర.    ఐనవోలు మల్లన్న  క్షేత్రం ..తెలంగాణలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం.  గొల్లకేతమ్మ,బలిజ మేడమ్మ సమేతంగా మల్లికార్జునుడు కొలువుదీరిన క్షేత్రం ఇది. కాకతీయుల కాలంలో మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. . తరతరాలుగా ఇక్కడ జనజాతర ఘనంగా జరుగుతుంది.గజ్జెల్లాగుల సవ్వడి.. డమరుక నాధాల ప్రతిద్వవి…ఒగ్గుగోలి వాయిద్యాల మధ్య శివసత్తుల పూనకాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం దద్దరిల్లిపోతుంది.

ఈ క్షేత్రంలో సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకుసాగే మల్లన్న బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా జరుగుతాయి.. భక్తకోటి సందడితో కైలాసాన్ని తలపిస్తోంది ఈ క్షేత్రం.  బండారి ధారణ.. పట్నాలు..శివసత్తుల ఆనంద కేళి..ఇలా ఎక్కడ ఎన్నెన్నో విశిష్టతలు.  కోరిన కోర్కెలు నెరవేర్చే కోరమీసాల మల్లన్నగా ఈ మల్లికార్జునస్వామిని పూజిస్తారు భక్తులు. తెలుగు రాష్ట్రాలు సహా దేశ నలుమూలల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు..సంతానం లేనివారు సంతానం కావాలని  కొబ్బరికాయతో ముడుపు కడుతుంటారు. బోనం, తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం..

ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీ.. మల్లన్న జాతరలో ఒగ్గు పూజలకు ఓ ప్రత్యేకత ఉంటుంది.. ఐనవోలు ప్రాంగణం అంతా శివసత్తుల పూనకాలు, డమరుకనాధాలతో దద్దరిల్లిపోతుంది.. ఈరగోలలు, గజ్జెల్లగుల భవిష్యవాణి ఒక్కడ మరో ప్రత్యేకత. కాకతీయుల కాలంనుండే ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్తులు ఆలయ బాధ్యతలు చూసుకునే వారు..1969 సంవత్సరంలో ఆలయ నిర్వహణను స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు.. అప్పటినుండి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం  ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు ఎమ్మెల్యే నాగరాజు.

సంక్రాంతి పర్వదినాన నిర్వహించే ప్రభ బండ్ల వేడుకను చూడటానికి జనం వేలసంఖ్యలో తరలివస్తారు.. ప్రభబండ్ల ప్రదర్శనలో ఎలాంటి రాజకీయ ప్రదర్శనకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశారు. పరమశువుడి ప్రతిరూపమే మల్లికార్జునుడు.  గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మ సమేతంగా కొలువైన కోరమీసాల మల్లన్న కొలిచి మొక్కితే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..