Hyderabad: రెస్టారెంట్‌ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు.. ఆపై వేడి వేడిగా తింటుండగా..!

ఈ మధ్యకాలంలో బిర్యానీలో బొద్దింకలు, జెర్రిలు, బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది. కొన్ని రోజుల క్రితం టాబ్లెట్ కవర్ కూడా కనిపించింది. ఇలాంటి వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా రెస్టారెంట్, హోటల్ యాజమాన్యాలలో మార్పు కనిపించడం లేదు. తాజాగా ఉప్పల్‌లో వెజ్ బిర్యానీ అర్డర్ చేస్తే.. బొద్దింక ప్రత్యక్షమైంది.

Hyderabad: రెస్టారెంట్‌ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు.. ఆపై వేడి వేడిగా తింటుండగా..!
Cockroach In Biryani
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2025 | 9:15 PM

సాధారణంగా బిర్యానీ మంచిగా ఘుమఘుమలాడాలంటే.. గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు ఉండాలి.  అటుపైన కొత్తి మీర, పుదీనా కూడా కావాలి. ఇవన్నీ పడితేనే బిర్యానీకి అసలైన టేస్ట్ వస్తుంది. కానీ ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్ వెజ్ బిర్యానీలో కూరగాయలకు బదులు.. పురుగులు, బల్లులు, జెర్రిలు వంటివి దర్శనమివ్వడం కామన్ అయిపోయింది. ఇలాంటి ఘటనలు పదే పదే వెలుగుచూస్తున్నాయి. దీంతో బయట బిర్యానీ తినాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు.

ఉప్పల్ కు చెందిన బాలకృష్ణ వెజ్ బిర్యానీ తినాలనుకున్నాడు. ఉప్పల్‌లోని మాస్టర్ చెఫ్ హోటల్ నుండి ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా వెజ్ బిర్యానీ అర్డర్ చేశాడు. వేడి వేడి వెజ్ బిర్యానీ అంటూ డెలీవరి బాయ్ తీసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చిన బాలకృష్ణ బిర్యానీ విప్పి తినబోతుండగా, బిర్యానీలో బొద్దింక కనిపించింది. ఒక్కసారిగా షాకైన బాలకృష్ణ ఆన్‌లైన్ డెలివరీ సంస్థకు కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. ఆందోళనకు గురైన కస్టమర్ హోటల్‌కు వెళ్ళి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలియక వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు ఉప్పల్ పోలీస్ ​స్టేషన్​‌లో కంప్లైంట్ చేశారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్‌ చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..