Ajith Kumar: దుబాయ్ కార్ రేసింగ్‏లో గెలిచిన అజిత్ టీమ్.. గాయపడిన సాధించిన హీరో..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం దుబాయ్ కార్ రేసింగ్‏లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హీరో కార్ రేసింగ్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల అజిత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో.. అజిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Ajith Kumar: దుబాయ్ కార్ రేసింగ్‏లో గెలిచిన అజిత్ టీమ్.. గాయపడిన సాధించిన హీరో..
Ajith Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 12, 2025 | 8:54 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కొన్నిరోజులుగా దుబాయ్‌లో జరుగుతున్న దుబాయ్ 24 హెచ్ కార్ రేస్‌లో తన టీంతో కలిసి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు జరిగిన 24 హెచ్ కార్ రేసింగ్ లో అజిత్ టీం విజయాన్ని అందుకున్నారు. హోరా హోరిగా సాగిన ఈ రేసింగ్ లో ఆయన టీం 901 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ అభిమానులకు, నటీనటులకు, సినీ పరిశ్రమకు అజిత్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇటీవల జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా రేసులో పాల్గొని విజయం సాధించారు. దీంతో ఆయనకు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును అందించింది టీమ్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.

అజిత్ నటించిన విదాముయార్చి సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్రయూనిట్ ఈ సినిమాను వాయిదా వేసింది. మరోవైపు కొన్ని నెలలుగా అజిత్ దుబాయ్‌లో కార్ రేస్ కోసం పూర్తి సమయం శిక్షణ శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమాలతోపాటు అజిత్ కు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు రెడీ అవుతాడు. ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాల తర్వాత మోటార్ రేసింగ్ లో పాల్గొన్నారు. ఈ రేసు కోసం చాలా రోజుల నుంచి శ్రమిస్తున్నారు. ఇటీవల ట్రాక్ ప్ ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆయన కారు ప్రమాదానికి గురైంది. గోడను బలంగా ఢీ కొనడంతో కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.

బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈఘటనలో అజిత్ స్వల్ప గాయాలతో బయపడ్డారు. కానీ గాయాలను ఏమాత్రం లెక్కచేయకుండా మరోసారి రేసింగ్ పోటీలో పాల్గొని విజయం సాధించారు అజిత్. ఈ పోటీలో అజిత్ టీం విజయం సాధించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శివకార్తికేయన్, మాధవన్, ప్రసన్న, దర్శకుడు మజీజ్ తిరుమేని, అధిక్ రవిచంద్రన్, వెంకట్ ప్రభు, నటి పార్వతి తదితరులు నటుడు అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..