Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె జీవితాన్నే మార్చేసిన రింగ్..అసలేం జరిగిందంటే?

ఆమె జీవితాన్నే మార్చేసిన రింగ్..అసలేం జరిగిందంటే?

Samatha J

|

Updated on: Jan 12, 2025 | 7:59 PM

పిల్లలు సరదాగా నడుము చుట్టూ తిప్పే హూప్‌ ను డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌లో భాగంగా చేసుకుంటున్నారు చాలా మంది మహిళలు. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్‌లో దేశంలోనే నంబర్‌1గా ఉంది ఈష్నా కుట్టి. హూపింగ్‌ వల్ల కండరాలు బలపడతాయి గుండె ఆరోగ్యం మెరుగై ఆందోళన ఒత్తిడి మాయమవుతాయి అంటోంది. డ్యాన్స్‌ అలాగే వ్యాయామంగా హూపింగ్‌.. స్త్రీల ఫిట్‌నెస్‌కు ఉపయోగం. ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించింది ఈష్న కుట్టి.

 చిన్నప్పుడు బంధువు ఒకామె హూప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందనీ కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నట్లు చెప్పింది. అయితే ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేయగా మెల్లగా వచ్చేసిందని తెలిపింది. దాంతో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు కొనసాగించినట్లు చెప్పింది. మెల్లమెల్లగా హూప్‌ తన శరీరంలో భాగమైపోయింది అంటోంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’లో ‘డిప్లమా ఇన్‌ డాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ కూడా చేసింది. సైకాలజీ ఇంకా హూపింగ్‌ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నాన్నట్టు చెప్పింది. తిహార్‌ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్‌ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్‌ నేర్పించింది. వారు హూప్‌ రింగ్‌తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారనీ ప్రతిసారీ ముందు కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించేవారని అంది ఈష్న.