Daaku Maharaaj: ప్రేక్షకులకు థ్యాంక్స్.. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ పై నిర్మాత నాగవంశీ క్లారిటీ.. ఏమన్నారంటే..
'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత బాలకృష్ణ నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ కొల్లి రూపొందించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలు పోషించారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ‘డాకు మహారాజ్’ సినిమాకి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశాము. అందుకే ఈ వారంలో సక్సెస్ మీట్ ను అనంతపురంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా పట్ల బాలకృష్ణ గారి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. పండగ సీజన్ కూడా కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉంది.” అన్నారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “తెలుగు ప్రేక్షకులు అందరికీ పేరు పేరునా మా టీం తరపున థాంక్స్ చెబుతున్నాము. రెండేళ్ళ క్రితం ఒక ఆలోచనతో ఈ ప్రయాణం, ఈ సంక్రాంతి కానుకగా మీ ముందుకు వచ్చింది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాము. బాలకృష్ణ గారి కెరీర్ లో గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని గతంలో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా నాగవంశీ గారు అన్నారు. ఆయన ఈ సినిమాని ఎంతో నమ్మారు. వంశీ గారి నమ్మకం నిజమై ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2023 సంక్రాంతి వాల్తేరు వీరయ్యతో విజయాన్ని అందుకున్నాను. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో వచ్చాను. సంక్రాంతి అనేది నాకు మరింత ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. ప్రేక్షకులు థియేటర్ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం మనసు పెట్టి సినిమా తీస్తే, తెలుగు ప్రేక్షకులు దానిని గుండెల్లోకి తీసుకుంటారని మరోసారి రుజువైంది. ” అని అన్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..