Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా ఏముంది అమ్మాయి అనుకునేరు.. తనెవరో తెలిస్తే బిత్తరపోతారు..!

గర్ల్‌ఫ్రెండ్ కావాలని కోరుకునే వారు మనలో కొందరు ఉంటారు. గర్ల్‌ఫ్రెండ్స్ లేరని ఆందోళన చెందుతున్న యువతకు శుభవార్త. చేతిలో కాస్త నగదు ఉంటే గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా పొందవచ్చు. కానీ ఇది మానవులు కాదు. డబ్బు ఉంటే మీరు AI రోబోట్ గర్ల్‌ఫ్రెండ్‌ని పొందవచ్చు. ఈ AI రోబోట్‌ను అమెరికన్ కంపెనీ రియల్‌బోటిక్స్ అవిష్కరించింది.

ఆహా ఏముంది అమ్మాయి అనుకునేరు.. తనెవరో తెలిస్తే బిత్తరపోతారు..!
Ai Rrobot Aria
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2025 | 6:37 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. AI సహాయంతో ఇప్పుడు చాలా పనులు సులువుగా మారాయి. ఈ సందర్భంలో, ఇప్పుడు AI సహాయంతో ఓ అందమైన AI రోబోట్ రూపుదిద్దుకుంది. దీనికి ఆరియా అని పేరు పెట్టారు. అమెరికన్ టెక్ కంపెనీ రియల్‌బోటిక్స్ ఒక ప్రత్యేకమైన AI రోబోట్ స్నేహితురాలిని సృష్టించింది. ఈ రోబో ప్రత్యేకత ఏంటంటే.. ఇది మనుషుల మాదిరిగానే మాట్లాడుతుంది. ఆమె తన భావోద్వేగాలను కూడా పంచుకోవచ్చు. ఆరియా ఎల్లప్పుడూ మీకు నమ్మకమైన తోడుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

అరియా నిజమైన మానవులకు అనుభవాన్ని అందించేలా రూపొందించడం జరిగిందని రియల్‌బోటిక్స్ సంస్థ పేర్కొంది. ఇది మీ ముఖ కవళికలను అనుకరించడమే కాకుండా మానవుల వంటి ప్రతిచర్యలను కూడా ఇస్తుంది. అంతే కాదు, మనుషులు కూడా ఈ రోబో రూపాన్ని తమ ఇష్టానుసారంగా మార్చుకోవచ్చు. ఇది వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకుంటుంది. ఆరియా ధర 175,000డాలర్లు(సుమారు రూ. 1.5 కోట్లు)గా నిర్ణయించారు. ఇది విలాసవంతమైన సాంకేతికత ఉత్పత్తిగా మారింది. అయితే, కంపెనీ దీనిని మూడు వెర్షన్లలో ప్రవేశపెట్టింది. ఇందులో బస్ట్ మోడల్ ధర 10,000 డాలర్లు, మాడ్యులర్ వెర్షన్ ధర 150,000 డాలర్లు, ఇక స్టాండింగ్ మోడల్ ధర 175,000 డాలర్లుగా నిర్ణయించారు.

ఆరియా వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, ఒక సోషల్ మీడియా వినియోగదారు ఆమెను “ఆడ రోబోట్ కంపానియన్” అని కూడా పిలిచారు. అదే సమయంలో, రియల్‌బోటిక్స్ సీఈఓ ఆండ్రూ కిగ్వెల్ ఏఐ రోబో ఏరియా గురించి వివరించారు. మానవులకు భిన్నంగా అనిపించని అలాంటి రోబోలను రూపొందించడమే తన ప్రయత్నమని అన్నారు. దీనితో పాటు, ఏరియా ధరపై ప్రజల నుండి మిశ్రమ స్పందనలు వెలువడ్డాయి. విలాసవంతమైన ఫ్లాట్‌ను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేయవచ్చని కొందరంటే, అసలు గర్ల్‌ఫ్రెండ్‌ కంటే తక్కువ ఖరీదు ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. అరియా సాంకేతిక రంగంలో విప్లవం మాత్రమే కాదు, మానవులు, రోబోట్‌ల మధ్య కనెక్టివిటీకి కొత్త ఉదాహరణను కూడా అందిస్తుంది. అయినప్పటికీ, ప్రజలు దాని ధర ఉపయోగం గురించి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..