Kuja Dosha: మిథున రాశిలోకి కుజుడు.. వైవాహిక జీవితంలో వారికి కొన్ని ఇబ్బందులు!
Kuja Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ఒక పాప గ్రహం. ఈ నెల (జనవరి) 21 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకూ కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేయబోతున్నాడు. కుజుడు మిథున రాశిలో ఉన్నంత కాలం కొన్ని రాశుల వారికి దాంపత్య జీవితంలో, ప్రేమ వ్యవహారాల్లో, కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనడంలో కొద్దిగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఈ కుజ గ్రహ దుష్ప్రభావం నుంచి బయటపడేందుకు ఆ రాశుల వారు తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది.
ఈ నెల 21 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకూ కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కుజుడు ఒక పాప గ్రహం. మిథున రాశిలో ఉన్నంత కాలం కొన్ని రాశులకు దాంపత్య జీవితంలో, ప్రేమ వ్యవహారాల్లో, కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనడంలో కొద్దిగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఈ కుజ గ్రహ దుష్ప్రభావం నుంచి బయటపడడానికి తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది. వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులకు కుజుడి వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జ్యోతిషశాస్త్రంలో దీన్ని మాంగల్య దోషంగా, కుజ దోషంగా అభివర్ణించడం జరిగింది. ఏదైనా రాశికి 1, 2, 4, 7, 8, 12 రాశుల్లో కుజ సంచారం జరుగుతున్నప్పుడు ఈ దోషం కలుగుతుంది.
- వృషభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం జరుగుతున్నందువల్ల దంపతుల మధ్య వాగ్వా దాలు, ఘర్షణలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ధనపరంగా, పిల్లలపరంగా ఇద్దరి మధ్యా చికాకులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరపాటు మాటలు మాట్లాడ కుండా జాగ్రత్త పడడం, పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. కుటుంబంలో కొద్దిగా సుఖ సంతోషాలు లోపించవచ్చు. దంపతుల్లో ఒకరు కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశిలో కుజుడి వక్ర సంచారం వల్ల కోపతాపాలు, అహంకారం, ఆధిపత్య ధోరణి బాగా పెరిగే అవకాశం ఉంది. వీటివల్ల కుటుంబంలో కలతలు రేగే అవకాశం ఉంది. దంపతులకు మధ్య అపా ర్థాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరిలో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ కావడానికి, ఎక్కు వగా ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. మొత్తం మీద దాంపత్య జీవితంలో సుఖం సంతోషాలు లోపించే అవకాశం ఉంది. కొద్ది రోజుల పాటు ఎంత సహనంగా ఉంటే అంత మంచిది.
- కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో వక్ర కుజుడి సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. దీని ఫలితంగా దంపతుల్లో ఒకరు అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవ కాశం కూడా ఉంది. దీనివల్ల దంపతుల మధ్య కొద్దిగా ఎడబాటు కలిగే సూచనలున్నాయి. దాంప త్యంలో సుఖం లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరగడం వల్ల కూడా కుటుంబంలో అశాంతి ఏర్పడుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల దంపతుల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుమానాలు, అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అకారణ విభేదాలు కలిగి, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రేమ వ్యవహారాల్లో కూడా కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. దీని వల్ల దంపతుల మధ్య తరచూ విభేదాలు తలెత్తడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి వాదులాడుకోవడం జరుగుతుంది. బంధువులు, పిల్లల వ్యవహారాలు కూడా సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. దంపతుల్లో ఒకరు అనారోగ్యానికి గురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మొత్తం మీద దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపించే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. బంధువుల కారణంగా కూడా విభేదాలు చోటు చేసు కోవడం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఇతరులను తలదూర్చనివ్వకపోవడం మంచిది. దాంపత్య జీవితంలోనే కాక, కుటుంబంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవ హారాల్లో కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి కలుగుతుంది. సహనంతో వ్యవహరించడం మంచిది.