వక్రగతి వీడనున్న గురువు.. ఆ రాశుల వారు సంపన్నులు కాబోతున్నారు..!
ప్రస్తుతం వక్రగతిలో సంచరిస్తున్న గురువు.. ఫిబ్రవరి 5న వక్రగతిని వీడి రుజు మార్గంలో సంచారం మొదలుపెట్టనున్నాడు. మే 25 వరకు గురువు ఎటువంటి దోషాలూ లేకుండా రుజు మార్గంలో సంచారం చేస్తాడు. సుమారు 110 రోజుల పాటు గురువు స్వతంత్రంగా, శక్తిమంతుడుగా వ్యవహరిస్తాడు. ఈ 110 రోజుల కాలంలో గురువు కొన్ని రాశుల వారిని సంపన్నులుగా మార్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా కొందరి దశ తిరగబోతోంది.
ఫిబ్రవరి 5న గురువు వక్రగతి నుంచి బయటపడడం జరుగుతోంది. మే 25 వరకు గురువు ఎటువంటి దోషాలూ లేకుండా రుజు మార్గంలో సంచారం చేస్తాడు. సుమారు నూట పది రోజుల పాటు గురువు స్వతంత్రంగా, శక్తిమంతుడుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ నూట పది రోజుల కాలంలో గురువు కొన్ని రాశుల వారిని సంపన్నులుగా మార్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి, ఆదాయం పెరగని వారికి, ఆదాయం లేనివారికి కొద్ది ప్రయత్నంతో కొత్త జీవితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు అతి తక్కువ స్థాయిలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారు తక్కువ శ్రమతో ఎక్కువగా ధన లాభం పొందే అవకాశం ఉంది. గురువు ఈ రాశి వారికి నూరు శాతం అనుకూలంగా మారుతున్నందువల్ల అపారమైన సంపదనిచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగానే కాకుండా, ఆదాయ వృద్దిపరంగా చేపట్టే ఎటువంటి ప్రయత్నమైనా పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యే అవకాశం ఉంది. మనసులోని కొన్ని కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువుకు బలం పడుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. గురు గ్రహం ఈ రాశికి అయాచితంగా, అప్రయత్నంగా కూడా ధన లాభాలు కలిగించే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాని బాకీలు పూర్తి స్థాయిలో వసూలవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తుల విలువ పెరగడం, పిత్రార్జితం లభిం చడం వంటివి తప్పకుండా జరుగుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా కలుగుతుంది.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల గురువు వీరిని అనేక విధాలుగా అనుగ్ర హించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలన్నీ అంచనాలకు మించి కలిసి వస్తాయి. పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు ఆశించినంతగా పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితంలో కూడా ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృశ్చికం: సప్తమ స్థానంలో ఉన్న గురువు వీరికి తప్పకుండా సంపదను అనుగ్రహిస్తాడు. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చ యం అవుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు కలుగుతాయి. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాల్లో గానీ, షేర్లలో గానీ పెట్టే పెట్టుబడులు దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు శక్తిమంత్రుడు, స్వతంత్రుడు కావడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఈ రాశి మీద గురు వీక్షణ ఉన్నందువల్ల జీవితంలో అనేక విధాలైన పురోగతి ఉంటుంది. కొద్ది శ్రమతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తి లాభం, భూ లాభం కలిగే అవకాశం ఉంది.
- మీనం: రాశ్యధిపతి గురువు ఈ మూడు నెలల కాలంలో ఈ రాశివారికి అత్యధికంగా అనుగ్రహించే అవ కాశం ఉంది. గురువు ధన కారకుడు, పుత్ర కారకుడు, గృహ కారకుడు అయినందువల్ల ఈ రాశి వారికి ధన యోగం, సంతాన యోగం, గృహ యోగం తప్పకుండా కలుగుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. ఆదాయాన్ని పెంచు కోవడానికి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం కూడా ఉంది.