Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూలత.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 13, 2025): మేష రాశికి చెందిన వారికి రోజంతా బాగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కొందరు బంధువుల వల్ల ఉపయోగం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (జనవరి 13, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కొందరు బంధువుల వల్ల ఉపయోగం కలుగుతుంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రాశి వారికి రోజంతా బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు చికాకు పెడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొందరు బంధువుల వల్ల ఉపయోగం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యో గులకు కొత్త ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి ఖాయం కావచ్చు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సఫలం అవు తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. బాధ్య తలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొందరు మిత్రుల తీరుతెన్నులు ఇబ్బంది పెడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం పెరుగు తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని అధిగమించడం జరుగుతుంది. ఇంటా బయటా అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అద నపు ఆదాయ ప్రయత్నాల మీద మరింతగా శ్రద్ద పెట్టడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దా నాలు చేయవద్దు. నిరుద్యోగులకు కొన్ని మంచి ఆఫర్లు అందుతాయి. కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో రాబడికి లోటుండదు. ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా సానుకూలంగా, విజయవంతంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కూడా సవ్యంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధి స్తారు. ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫల మయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఇతరుల వివా దాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. కష్టార్జితంలో కొద్దిపాటి పెరుగుదల కనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగం స్థిరంగా కొనసాగుతుంది. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గ్రహ బలం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహా యపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణ యాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. అనుకో కుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. కొద్ది శ్రమతో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.